అనుమానాస్పద స్థితిలో బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

అనుమానాస్పద స్థితిలో బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. శేరిలింగంపల్లి డివిజన్‌లోని దుబే కాలనీలో నివసించే సౌజన్య.. బాచుపల్లి డీఆర్కే కాలేజీలో బీటెక్‌ చదువుతోంది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.