-ఇక్కడ ప్రజలు యంత్రాలు అనుకొని ఓట్లు వేసుకున్నారు.
– కానీ ప్రజల తో మమేకం కాలేదు గత పాలకులు
హైదరాబాద్ మహా వెలుగు ప్రతినిధి : చెన్నూరు పట్టణ ప్రజలు అందరు కలిసి రావాలి. ఆరు దశాబ్దాలుగా వెనుకబడిన పట్టణం ఎంతో మంది ఇక్కడ నుండి రాష్ట్ర స్థాయి , ఢిల్లీ స్థాయి ,కేంద్రం స్థాయిలో మంత్రులుగా పని చేసిన వారు ఉన్న , ఎప్పుడు దీన్ని పట్టించుకోకుండా , అవకాశం ఉన్న ఎడారి గా మార్చిండ్లు. ఈ ప్రాంతాన్ని కేవలo ఎడారి లాగా ,ఓట్లు వేసే యంత్రాలు అనుకున్నారు. కానీ ఇక్కడ ప్రజలతో మమేకం కాలేదని ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజం ఎత్తారు. చెన్నూరు పట్టణం లో కేసీఆర్ బర్త్ డే సుదీనo గా సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చెన్నూరు చరిత్ర లో ఇది జీలుగు వెలుగు లని బాల్క సుమన్ పేర్కొన్నారు. చెన్నూర్ లో కులం లేదు , మతం లేదు ,పార్టీ లు లేవు ఒక్కటే అభివృద్ధి జపం చేయాలని పట్టణ అభివృద్ధికి అందరం కలిసి కట్టుగా పని చేయాలని తెలిపారు. రాష్ట్రంలో ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని కేసిఆర్ , కేటీఆర్ చొరవ మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే పట్టణ ప్రజలతో పాటు , నియోజకవర్గ ప్రజల దీవెనలు ,ఆశీస్సులు ఉండాలని కోరారు. ఇక్కడ ప్రాంతం అభివృద్ధికి , సమాజ సేవకు పునరేకింతం అవుతాని , చెన్నూరు పట్టణం లో కుమ్మరి కుంట చెరువు ను మూడు కోట్ల తో మినీ ట్యాoక్ బ్యాండ్ తీర్చిదిద్దుతున్నామని , పెద్ద చెరువును రూ. 6 కోట్ల తో మినీ ట్యాంక్ బ్యాండ్ గా తీర్చిదిద్దే కార్యక్రమం నడుస్తోందని తెలిపారు. నేషనల్ హ్యావే పక్కన రూ. 3 కోట్ల 60 లక్షల పైచిలుకు నిధులతో మినీ స్టేడియంను నిర్మిస్తాఉన్నాం. నాలుగు వందల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నేషనల్ హ్యావే పక్కనే నిర్మిస్తున్నాo . అదేవిధంగా గోదావరి నది తీరాన కోటి రూపాయల పై చిలుకు నిధులతో వైకుంఠ ధమాన్ని కూడా నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. ఇవే కాకుండా సిమెంట్ రోడ్లు ,డ్రైనేజీలు ,మిషన్ భగీరథ పనులు కూడా పూర్తి అవుతున్నాయని తెలిపారు. నూతన ఆసుపత్రి చెన్నూరు పట్టణమే కాకుండా భీమారo మండలo ,కోటపల్లి మండలం , వేమనపల్లి మండలం ,తో పాటు మహారాష్ట్ర లోని సిరోoచ్చకు కూడా వైద్య సదుపాయాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ రాం లాల్ గిల్డ , వైస్ చైర్మన్ నవాజ్ కౌన్సిలర్లు , ప్రజా ప్రతినిధులు ,అధికారులు , టిఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.