చనిపోయిన 5 రోజులకు బూస్టర్ డోస్ ఇచ్చారట

Bhadradri kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కొత్త మల్లారెడ్డి ఈనెల 11వ తేదీన చనిపోయారు. అయితే వైద్య శాఖ సిబ్బంది మాత్రం బుధవారం (ఫిబ్రవరి 16)న బూస్టర్ డోస్ తీసుకున్నట్టుగా రికార్డుల్లో నమోదు చేశారు..జిల్లా కేంద్రంలోని న్యూగొల్లగూడెంకు చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కొత్త మల్లారెడ్డి ఈనెల 11వ తేదీన చనిపోయారు. అయితే వైద్య శాఖ సిబ్బంది మాత్రం బుధవారం (ఫిబ్రవరి 16)న బూస్టర్ డోస్ తీసుకున్నట్టుగా రికార్డుల్లో నమోదు చేశారు. ఇదే విషయం సెల్ ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో వాళ్ల కుటుంబ సభ్యులు కొవిన్ యాప్‌లో సర్టిఫికెట్ డౌన్ లోడ్ చేసి చూస్తే, అందులో కూడా బుధవారం వ్యాక్సిన్ వేసినట్టుగా ఎంట్రీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారాయి.. వైద్యశాఖ సిబ్బంది నిర్లక్ష్యంపై నెటిజన్లు ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తున్నారు