నేరాల నియంత్రణలో సిసి కెమెరాల పాత్ర కీలకం

  • శాంతి భద్రతల పరిరక్షణ మరియు సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
  • మంచిర్యాల ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్

రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐజీ ఐపీఎస్ మంచిర్యాల ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ఆదేశాల మేరకు ఏసీపీ మంచిర్యాల తిరుపతి రెడ్డి పర్యవేక్షణ లో మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ నారాయణ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి రాజీవ్ నగర్ ప్రాంతం లో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహించి ఇళ్లను సోదాలు చేశారు.

ఈ తనిఖీలలో 65 మోటర్ సైకిల్స్15 త్రీ వీలర్స్ 04 ఫోర్ వీలర్స్, పెద్ది తిరుపతి, కొలిపాక సంతోష్, బంధం పోషం, బంధం జ్యోతి లు నడిపిస్తున్న బెల్ట్ షాప్ లను తనిఖీ చేసి 25,000 వేల రూపాయల మద్యం సిజ్ చేశారు.

ఈ సందర్భంగా మంచిర్యాల ఇంచార్జ్ డీసీపీ మాట్లాడుతూ… నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి ఎవరైనా కొత్త వ్యక్తులు గాని, నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసిపి తిరుపతిరెడ్డి, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ నారాయణ, మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్, శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు, మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.