మంచిర్యాల జిల్లా , భీమారo మండలం, ఖాజీపల్లి గ్రామ పంచాయతీని మంచిర్యాల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆకస్మికంగా పర్యటించి , పారిశుద్ధ్య పనులను పరిశీలించి పంచాయతీ కార్యదర్శి నలిమల సంధ్య రాణి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకసారి ఇదే పునరావృతం అయినట్లయితే పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తప్పవని హెచ్చరించరించారు. అనంతరం గ్రామంలోని నర్సరీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎం.పి.డి.ఓ. శ్రీనివాస్, ఎం.పి.ఓ. శ్రీపతి బాపురావు తదితరులు పాల్గొన్నారు.