*ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన*
*నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న అధికారులు*
మహా వెలుగు, బాసర, ఆగష్టు 05: బాసర త్రిబుల్ ఐటీని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. అధికారులు తాము చేయాల్సిదంతా చేస్తున్నామని బయటకి చెబుతున్న చేతుల్లో మాత్రం అలాంటిది ఏమి కనిపించడం లేదు.
ఓ వైపు ఫుడ్ పాయిజన్, విద్యార్థుల ఆందోళన అన్ని పరిశీలిస్తున్నట్లు అధికారుల సందేశాలు ఇవన్నీ జరుగుతున్నా త్రిబుల్ ఐటీ సిబ్బందిలో మార్పు రావడం లేదు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ఎన్నో రోజులుగా త్రిబుల్ ఐటీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అధికారులు నా మాత్రపు తనిఖీలు నిర్వహించడం మినహా ఏమి చేయడం లేదని పలువురు ఆగ్రహం చేస్తున్నారు.
తాజాగా త్రిబుల్ ఐటీ కళాశాలలో మెస్ లో ఉన్న వంటశాలలో స్నానం చేస్తూ అక్కడి సిబ్బంది కెమెరాకు చిక్కారు. ఆ వీడియోలో పక్కనే వంటలు వండుతూ అక్కడే స్నానాలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. వంట చేసే సిబ్బంది శుభ్రత పాటించకపోవడం, వంటశాలలో స్నానాలు చేయడం వల్లనే తరచూ ఫుడ్ పాయిజన్ కారణం అవుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం త్రిబుల్ ఐటీ యూనివర్సిటీ అధికారులు విషయం తెలియడంతో నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని సమాచారం. మరోవైపు ఈ వ్యవహారం బయటకు రాకుండా చేస్తున్నారని పలువురు దుయ్యబడుతున్నారు.
