మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ ,వి.కపిల్ కుమార్ మహబూబాబాద్ 22. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎనిమిదో వార్డు కౌన్సిలర్ బానోతు రవి హత్య ఉదంతం ను మహబూబాబాద్ పోలీసులు చేధించారు.
- భుక్య విజయ్ కుమార్ తండ్రి బాల్య వయస్సు 34 సం. కులం: లంబాడ, వృత్తి కర్తవ్యాపారం, నివాసం: మంగళీ కాలనీ, సత్తిపాక, మహబూబాబాద్ –
- భుక్య అరుణ్ తండ్రి బిచ్చ, వయస్సు: 20 సం. కులం లంబాడ, నివాసం: బాబు నాయక్ తండా
- అశ్మీర బాలరాజు, తండ్రి పరి, వయస్సు 26 సం, కులం: లంబాడ నివాసం: బాబు నాయక్ తండా
- గుగులోతు చింటు • సతీష్ తండ్రి వీరన్న, వయస్సు. 23 సం. కులం: లంబాడ, నివాసం: మంగళి కాలనీ
- కారపాటి సుమంత్ తండ్రి శ్రీమ, వయస్సు 23 నం, కులం మాదిగ, నివాసం హరిజనవాడ, మహబూబాబాద్
- జ్మీరకుమార్, తండ్రి బాల, వయస్సు: 22 నం, కులం లంబాడ, నివాసం మంగలి కాలనీ
- గుగులోతు భావుసింగ్, తండ్రి విచ్చు వయస్సు 50 సం,, కులం, లంబాడ, నివాసం గొల్లచెర్ల గ్రామం. డోర్నకల్ మండలం
బానోతు రవి అనే వ్యక్తికి గతంలో మంగళి కాలనికి చెందిన భుక్య విజయ్. వయస్సు 34 నం. మరియు బాబు నాయక్ తండా కు చెందిన భుక అరుణ్, వయస్సు 20 సం. లు సన్నిహితంగా ఉంటూ బానోతు రవి చేసే బిజినెస్ లలో సహకరించేవారు. అలా ప్రతి విషయంలో బానోతు రవి వారిని వాడుకున్నడే తప్ప డబ్బులు ఇవ్వటం లేదని, వారు కూడా సొంత వ్యాపారాలు మొదలు పెట్టుకున్నారు. అప్పటినుండి వారి మధ్య మనస్పర్థలు పెరిగి, మాట్లాడుకోవటం మానేసారు. ఈ క్రమంలో భుక్య విజయ్ యొక్క ట్రాక్టర్ ను కర్రను తరలించటానికి ఉపయోగించే క్రమంలో ఫారెస్ట్ వారు రెండు సార్లు పట్టుకోగా, బానోతు రవి నే ఉద్దేశ పూర్వకంగా పాటించాడని విజయ్ భావించాడు, అదే విధంగా, తన మేన మామకు మెడికల్ కాలేజీ దగ్గర గల మూడు ఎకరాల భూమిని పట్టా చేసిస్తానన్న విషయంలో రవి వాళ్ళను డబ్బులు డిమాండ్ చేసాడని, విజయ్ అతనిపై పగ పెంచుకున్నాడు.
అదే క్రమంలో, విజయ్ కి బంధువు అయిన బాబు నాయక్ తండాకి చెందిన భుక్క అరుణ్ కూడా ఈ మధ్య కాలంలో నల్ల బెల్లం అక్రమంగా తరలిస్తూ, మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ వారికి పట్టుబడ్డాడు. అతనిపై కేసీ నమోదు అయ్యి బెల్లం వాహనం సీజ్ అయ్యింది. ఆ తర్వాత ఒక ఐస్ క్రీం అమ్మే వ్యక్తితో అరుణ్ గోడవపడగా, మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. అయితే అతను బెల్లం తరలించేటప్పుడు పోలీస్ వారికి సమాచారం ఇచ్చింది. ఐస్ క్రీం అమ్మే వ్యక్తితో జరిగిన గొడవ గురించి కేసు పెట్టించింది. బానోతు రవి నే అని అరుణ్ భావించి, అతని అక్రమ వ్యాపారాలకు అడ్డు తొలగించుకోవాలని భావించాడు.
వీరిద్దరితో పాటు బాబు నాయక్ తండాకి చెందిన అజ్మీర బాలరాజుకు కూడా బానోతు రవి దూరపు బంధువు. బాలరాజు కూడా బెల్లం వ్యాపారం చేస్తున్న సమయంలో రవి అడ్డుపడినాడని, బాలరాజుకు వచ్చిన పెళ్లి సంబంధంను బానోతు రవి చెడగొట్టి నాడని, బాలరాజుకు కూడా, బానోతు రవి అంటే కక్ష కలదు… గత కొద్ది రోజుల నుండి విజయ్, అరుణ్ మరియు బాలరాజు లు తరచూ మద్యం సేవిస్తూ, వారి వ్యాపారాలకు అడ్డు వస్తున్నా బానోతు రచిని చంపాలనే నిర్ణయానికి వచ్చి ఒక గొడ్డలి మరియు కత్తిని తయారుచేయించి, విజయ్ ఇంట్లో దాచిపెట్టారు. మొదటగా ఒక కారు కిరాయి తీసుకొని, దానితో బానోతు రవిని గుద్ది చంపాలి. ఆ క్రమంలో చనిపోకపోతే గొడ్డలి, కత్తులతో నరకాలి అనే పథకం రచించారు.
వారి పథకం ప్రకారం బానోతు రవిని చంపటానికి గత మూడు రోజులనుండి ప్రయత్నిస్తూ, రవి సమయానికి వారికి దొరకనందున, బానోతు రవి సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయటానికి విజయ్, అరుణ్ లు వారి స్నేహితులు అయిన మంగళి కాలనీకి చెందినా గుగులోతు చింటు జై సతీష్ మరియు మరో ఇద్దరు వ్యక్తులను తయారుచేసుకున్నారు. తేది: 20.04, 2022 రోజున మహబూబాబాద్ టౌన్ లో ఒక వ్యక్తి దగ్గరి నుండి పెళ్లి కోసం అని చెప్పి, SHIFT DEZIRE కారును మూడు రోజులకుగాను కిరాయి తీసుకున్నారు. తేది 21,04,2022 రోజున ఉదయం నుండే విజయ్, అరుణ్ బాలరాజు, చింటు @ సతీష్ మరియు మరో ఇద్దరు కలిసి మద్యం సేవిస్తూ, బానోతు రవి సమాచారం సేకరిస్తూ, అనువైన సమయం కోసం వేచిచూస్తున్నారు.
కాని ఎంతసేపటికి రవి ఒంటరిగా దొరకక పోషటంతో, విజయ్, బలరాజులు వారి ఇంటికి వెళ్ళగా, అరుణ్ మహబూబాబాద్ టౌన్ లో కారులో చక్కర్లు కొడుతూ, రవి కోసం దక్కి చేసాడు. అందాజ 11.30 గంటల సమయంలో బానోతు రవి పత్తిపాక వైపు వెళ్ళటం చుసిన ఆరుణ్ అతన్ని కారులో ఫాలో అప్పుతూ, విజయ్ కి సమాచారం ఇవ్వగా, విజయ్ తన సొంత ట్రాక్టర్ వేసుకొని, రవికి ఎదురుగా వస్తూ పత్తిపాక లోని మిలిటరీ శ్రీను ఇంటి దగ్గర విజయ్ కి ఎదురుగా వస్తున్న రవిని, ట్రాక్టర్ తో స్పీడ్ గా వెళ్లి గుద్దినాడు. రవి క్రింద పడి ఉండగా, విజయ్ ట్రాక్టర్ దిగి, అప్పటికే రవి వెనకాల అరుణ్ కారులో రాగా, విజయ్ ట్రాక్టర్ దిగి కారులో అప్పటికే పెట్టుకున్న గొడ్డలిని తీసుకోగా, అరుణ్ కత్తి తీసుకున్నాడు. ఇద్దరు రవిపై దాడి చేయగా, కొద్దిసేపు రవి గొడ్డలిని పట్టుకొని ప్రతిఘటించాడు.
కాని విజయ్ బలంగా గొడ్డలిని లాక్కొని తలపై బలంగా పలుమార్లు నరకగా, ఆరుణ్ కత్తితో పొడవగా, బలమైన రక్త గాయలై, రవి క్రింద పడిపోయాడు. కొనపిరితో ఉన్న రవిని 108 అంబులన్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించినప్పటికీ అతను ప్రాణాలు వదిలాడు. నిందితులు విజయ్, అరుణ్ లు పారిపోయే క్రమంలో విజయ్ యొక్క మామయ్య అయిన గుగులోతు రావుసింగ్ కి రవిని చంపిన విషయం చెప్పగా, విజయ్ ట్రాక్టర్ దాయటానికి భావుసింగ్, విజయ్ కి సహాయం చేసాడు.
ఈ కేసులో హత్య గురించి సమాచారం అందిన వెంటనే, నేరస్థలన్ని పరిశీలించి, నేరస్థలంలో గల గొడ్డలిని స్వాధీనమ చేసుకోనైనది, నేరస్తుల కోసం పోలీసువారిని బృందాలుగా అన్నివైపుల పంపనైనది. రవి హత్య చేసిన తర్వాత, నేరస్థులు విజయ్, అరుణ్ లు కలిసి పారిపోవుటకు ప్రయత్నం చేస్తుండగా,
మహబూబాబాద్ టౌన్ పోలీస్ చాకచక్యంగా నిన్ను అనగా తేది: 21.04.2022 బండ క్రాస్ రోడ్డు వద్ద నేరస్థులు 11. భుధ్య విజయ్, 2) ముక్య అరుణ్ లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన SHIFT DEZIRE కారు ఆరుణ్ ఉపయోగించిన కత్తి, వారి ఫోన్లు, రక్తపు సురకలు గల వారి బట్టలు స్వాధీనం చేసుకోనైనది. వారి వాంగులాల ప్రకారం నేరస్థులు 3), అక్కర బాలరాజు, 4), గుగులోతు చింటు @ సతీష్ 5). గుగులోతు భావుసింగ్, 6) అజ్మీర కుమార్ మరియు 7) కారపాటి సుమంత్ లను ఈరోజు అనగా తేది: 22.04.2022 రోజున అదుపులోకి తీసుకొని బాలరాజు రెక్కికి ఉపయోగించిన అరుణ్ యొక్క రాయల్ ఎన్ఫీల్డ్ బండి, భావుసింగ్ దాచిపెట్టిన విజయ్ యొక్క ట్రాక్టర్ మరియు అందరి సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకోనైనది.
ఇట్టి కేసును అతి తొందరగా చేధించుటలో భాగస్వామ్యులైన శ్రీ యోగేశ్ గౌతమ్, IPS, Addi_SP మహబూబాబాద్, శ్రీ P. సదయ్య DSP మహబూబాబాద్, Clలు Y. సతీష్ S. రవి కుమార్, మహబూబాబాద్ టౌన్ SI ACCS IT core సిబ్బంది మరియు ఇతర సిబ్బంది లకు అభినందనలు తెలియజేస్తున్నాను,. శరత్ చంద్ర ప్రవాధ్ (PS)
