10 ఇసుక ట్రాక్టర్లు సీజ్

వి. కపిల్ కుమార్, మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్
మహబూబాబాద్ జిల్లా 23 ,:మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ips ఆదేశాల మేరకు చిన్న గూడూరు, నెల్లికుదురు, మరిపెడ పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్న నిర్దిష్ట సమాచారం మేరకు నిన్న రాత్రి మహబూబాబాద్ జిల్లా టాస్క్‌ఫోర్స్ దాడులు చేసి (10) ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగింది. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.