137 వ, మే డే, ఉద్యమాల గడ్డ బయ్యారం పై ఎగిరిన జెండా

వి కపిల్ కుమార్,మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్/ బయ్యారం. 1 : మహబూబాబాద్ జిల్లా ఇల్లెందు నియోజకవర్గం బయ్యారం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మరియు సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నప్పటి నుండి బయ్యారం ఉద్యమాల గడ్డ కమ్యూనిస్టు ప్రభావిత మండలం పేరు పొందింది. గత రెండు సంవత్సరాలుగా కరోనా వ్యాధి వలన మే డే ఉత్సవాలు దేశవ్యాప్తంగా పార్టీ కార్యాలయాలకే పరిమితమైన పరిస్థితి.

ఈ మేడే ఉత్సవాల్లో భాగంగా బయ్యారం జాతీయ రహదారి వద్ద పుచ్చలపల్లి సుందరయ్య స్థూపంపై పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మండ రాజన్న పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం సిఐటియు స్తూపం వద్ద సిఐటియు సీనియర్ నాయకులు వెన్ను మోహన్ యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించారు. వేజెండ్ల సైదులు రావు భవన్ (సిపిఐ (ఎం)మండల కార్యాలయం) పై పార్టీ సీనియర్ నాయకులు తోడుసు యాదగిరి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ సాయుధ పోరాట స్మారక స్థూపం వద్ద పార్టీ సీనియర్ నేత మెరుగు వెంకన్న పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బయ్యారం పి హెచ్ సి సెంటర్ లో ఉన్న ఏలూరు స్తూపం వద్ద సిఐటియు మండల కన్వీనర్ వల్లాల వెంకన్న పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

వందనం చేస్తున్న కార్మికులు

అనంతరం బయ్యారం మండలం జగ్గు తండ గ్రామపంచాయతీ పరిధిలో బుడగ జంగాల కాలనీ లో పార్టీ స్తూపం వద్ద జగ్గు తండ సర్పంచ్ బోడ రమేష్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. మండలంలో కొత్తపేట, ఇరుసులాపురం, కాచనపల్లి గ్రామాలలో మేడే సందర్భంగా పార్టీ పతాకాలను, ట్రేడ్ యూనియన్ పథకాలను ఆవిష్కరించారు.

బయ్యారం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిఐటియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మండ రాజన్న పార్టీ మండల కార్యదర్శి నంబూరి మధు సిఐటియు మండల కన్వీనర్ వల్లాల వెంకన్న మే డే సభలో పాల్గొని మేడే స్పూర్తిని వివరిస్తూ.

జిల్లా కమిటీ సభ్యులు మండ రాజన్న మాట్లాడుతూ చికాగో నగరంలో పెట్టుబడిదారులకు కార్మికులకు మధ్య జరిగిన పని ఒప్పందం పనికి తగిన వేతనం పై జరిగిన విప్లవ పోరాట ఫలితంగా అనేకమంది బలిదానాల సాక్షిగా కార్మికులు తమ హక్కులను సాధించుకున్నారని ఈ ఉద్యమం వయసు నేటికి 137 సంవత్సరాలు అయిందని వారి స్ఫూర్తితో కార్మికులు ఏకతాటిపై నిలబడి హక్కుల సాధన కోసం పోరుబాట పట్టాలని సూచించారు.

కార్యదర్శి నంబూరి మధు మాట్లాడుతూ… దేశంలో అనిచివేత ధోరణి పై మిలిటెంట్ పోరాటాలు చేస్తే తప్ప సామాన్యులకు కార్మికులకు తమ హక్కుల సాధన దాని ఫలితాలు అందవని ఢిల్లీ రైతాంగ ఉద్యమం స్ఫూర్తిదాయక ఆ ఉద్యమ అడుగుజాడల్లోనే కార్మిక శక్తి ఒక్కటై ఉద్యమించి కార్మిక కర్షక శక్తిని ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారి మన భారతదేశంలో జరిగిందని ఈ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

సిఐటియు మండల కన్వీనర్ వల్లాల వెంకన్న మాట్లాడుతూ జలియన్వాలాబాగ్,తెలంగాణ సాయుధ పోరాటం, ఢిల్లీ రైతాంగ ఉద్యమం ని పుణికిపుచ్చుకొని అదే బాటలో కార్మికులు, కర్షకులు నిరుద్యోగులు ,సంఘటిత, అసంఘటిత, కాంట్రాక్ట్ కార్మికులు, వ్యవసాయ కార్మికులు నడవాలని తెలియజేశారు.
ఈ మే డే కార్యక్రమంలో పార్టీ మండల సెక్రటేరియట్ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, శాఖా కార్యదర్శులు, పార్టీ సభ్యులు మరియు అభిమానులు సిఐటియు మండల కమిటీ సభ్యులు, సంఘ కార్యదర్శులు, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.