- సి.పి.ఐ(ఎం) మండల కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ ఖాజా
- మహావెలుగు కురవి/ఏప్రిల్30 రిపోర్టర్ చల్ల వేణు : 137వ మేడే పండుగను జయప్రదం చేయ్యాలని సి.పి.ఐ(ఎం) మండల కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ ఖాజా కార్యకర్తలను కోరారు. శనివారం నాడు మండల కేంద్రంలో అగ్జలరీ గ్రూపు సెల్ సమావేశం కంది పాటి ఉమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఖాజా ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ. పని గంటలు తగ్గించాలని 137 సంవత్సరాల క్రితం చికాగో నగరం పని గంటలు తగ్గించాలని కార్మికులు సమ్మె చేస్తుంటే అక్కడ ఉన్న పెట్టుబడిదారీ వర్గం కాల్పులు జరిపింది. 7గురు కార్మికులు మరణించారు. ఆరక్తం నుండి పుట్టినదే ఎర్ర జెండా ఎంతో చారిత్రక నేపద్యం ఉన్న మే డే ఉత్సవాల్లో రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని అన్నారు. దేశంలో అధికారంలోకి వచ్చిన బి.జె.పి ప్రభుత్వం పరిశ్రమలను మూసి వేసి కార్మికులను బయటకు నేడుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు అయిన ఎల్.ఐ.సి, బొగ్గు, విమానయానం, చమురు, నిక్షేపాలు, వైద్యం, రైలు లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ. ప్రజలపై మోయలేని భారాలను పన్నులు ధరల రూపంలో వారు విమర్శించారు. ఈ సమావేశంలో రడం సారయ్య, అజ్మీర వీరు, బత్తిని వెంకన్న, ఇర్రి యాకయ్య, ఎల్లయ్య, వీరభద్రం,మున్నా, రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.