18 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోస్: కేంద్రం

మహా వెలుగు పెద్దపల్లి ప్రతినిధి 08 :కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోస్ అదించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. గతంలో మాదిరిగానే కోవిన్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి. అనంతరం స్లాట్ ప్రకారం ప్రైవేటు కేంద్రాల్లో టీకా ఆదివారం నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. ఇప్పటి వరకు ఫ్రంట్ లైన్ వారియర్లు, 60 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రమే బూస్టర్ డోస్ అందించారు. ఇప్పటి నుంచి
అందరికీ బూస్టర్ డోస్ అందించాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.