2009 ఎస్ఐల బ్యాచ్ ఔదర్యం

  • రాఘవేందర్ కుటుంబానికి అండగా 1103
  • రూ.29 లక్షలు రాఘవేంద్ర కుటుంబానికి అందజేసిన బ్యాచ్ మెంట్స్

స్నేహమేరా.. జీవితం స్నేహం కోసం.. ప్రాణాలు ఇద్దాం అనే నానుడి ఊరికే రాలేదు కొందరు స్నేహితులు తమ కెందుకులే అని పోతూ ఉంటే , మరికొంత మంది స్నేహం కోసం పాటుపడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబ్ నగర్ రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ గౌడ్ మరణించిన విషయం తెలిసిందే , 2009 బ్యాచ్ కు చెందిన రాఘవేందర్ మరణం తో ఉలిక్కిపడిన ఓకే శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన నేస్తాలకు తీవ్రమైన ఆవేదన కలిగించింది ఇటువంటి సమయంలోనే తన స్నేహితుని కుటుంబానికి అండగా నిలవాలని 2009 సబ్ ఇన్స్పెక్టర్లు మ్యాచ్ రెండు రాష్ట్రాల్లో పనిచేస్తున్న వీరు స్నేహితుని కోసం వారి కుటుంబ సభ్యులకు అండగా నిలబడ్డారు ఈ క్రమంలో దశ దిన కర్మ సోమవారం మహబూబాద్ లో నిర్వహించగా రూ.29 లక్షలు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న(1103) గల బ్యాచ్ అందజేశారు. గతంలోనూ ఏలూరు రేంజ్ లో చనిపోయిన ఇద్దరు ఆఫీసర్లకు రూ.50 లక్షల వరకు హైదరాబాద్ రేంజ్ లో సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి గత సంవత్సరం అబ్దుల్లాపూర్మెట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన లక్ష్మణ్ పిల్లలకు రూ.40 లక్షల వరకు ఆర్థికంగా అండగా ఉన్నట్లు 2009 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్లు తెలిపారు. రాఘవేందర్ మరణo తీరని లోటని వారు తెలిపారు.