రూ.50 వేల విరాళం అందజేత

మంచిర్యాల జిల్లా : మందమర్రి మండలం సారంగపల్లి గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి దేవాలయంకు నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం అశోక్ రూ.50 వేల విరాళం అందజేశారు. సారంగపల్లి గ్రామానికి చెందిన పలువురు భక్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు దుర్గం అశోక్ తెలుపగా వారు స్పందించి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా దుర్గం అశోక్ మాట్లాడుతూ…. సమాజ సేవ చేయడం తమ బాధ్యతని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.