56 వ వార్షిక క్రీడా పోటీలను ప్రారంబించిన జీఎం కె . నారాయణ

మహా వెలుగు ,రామగుండం సెప్టెంబర్ 08:- రాకేష్ నామని : రామగుండం గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం నందు ఆర్జీ-1 ఏరియా వర్క్ ఫీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ డబ్ల్యు పిఎస్ &జి యే ఆద్వర్యంలో అంతర్గత ఆటల పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఇట్టి పోటీలకు ఆర్జీ-1 జియం కె. నారాయణ ముఖ్య అతిధిగా హాజరయి రిబ్బన్ కత్తిరించి పోటీలను ప్రారంభించడం జరిగినది.ఈ సందర్భముగా ఏర్పాటు చేసిన సమావేశంలో జియం మాట్లడుతూ డబ్ల్యు పిఎస్ &జి యే ఆద్వర్యంలో క్రీడా పోటీలు ఫుట్ బాల్,చెస్ , క్యారమ్ , హాకి,బాస్కెట్ బాల్ ,లాన్ టెన్నిస్ , అథ్లెటిక్ ,మహిళక త్రో బాల్ , స్విమ్మింగ్ ,షటిల్ ,టేబుల్ టెన్నిస్ , వాలి బాల్,కబడ్డి , క్రికెట్ తదితర పోటీలను నిర్వహిస్తున్నామని, ఈ ఆటలు ఆడటం వలన ప్రతి ఒక్కరికి మానసిక ఉల్లాసం కలిగి శారీరక శ్రమను మరిచిపోవడానికి ఇది ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఆటలలో పాల్గొనే వారికి శారీరక శ్రమ దరిచేరకుండా శరీర సౌష్టవం పెంపొంది ఏ జబ్బులు దరిచేరవని వీటి వలన మనిషిలో చురుకుదనం, ఆరోగ్యం మరియు గెలుపోటములపై ఆసక్తి ఏర్పాడి ఒక పోటితత్వం మరియు సాధించలనే తపన పట్టుదల పెంపొందుతాయని తెలిపారు. కావున ఈ పోటీలలో పాల్గొనే వారు గెలుపోటములను సమనంగా స్వీకరించి మున్ముందు మరింత సాధన చేసి ఉన్నత లక్ష్యం ఏర్పరుచుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో టిబిజికెయస్ ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్ రావు , ఎస్.ఓ.టు.జీఎం ఎం. రామ్ మోహన్ డబ్ల్యు పిఎస్ &జి యే) చీఫ్ కొ ఆర్డినేటర్ & డీజీఎం పర్సనల్ సి హెచ్. లక్ష్మి నారాయణ ,ఆర్జీ-1 ఏరియా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గౌరవ కార్యదర్శి బంగారు సారంగపాణి, ఏరియా ఇంజనీరు జగన్ మోహన్ రావు, సిఎంఓఐ జనరల్ సెక్రటరీ డేవిడ్,ఏజీఎం ఎక్స్ ప్లోరేషన్ శివ నారాయణ , డీజీఎం సివిల్ నవిన్, డీజీఎం ఏరియా వర్క్ షాప్ మధన్ మోహన్, సర్వే అధికారి పి ప్రభాకర్ , ఫారెస్ట్ అధికారి అభిలాష్, సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరా రెడ్డి, ఎస్ ఈఈ & ఏం దాసరి శ్రీనివాస్, స్పొర్ట్స్ సూపర్ వైజర్ రమేశ్ , స్పొర్ట్స్ కొ ఆర్డినేటర్ సత్యనారాయణ , స్పొర్ట్స్ కోచ్ లు మరియు అధిక సంఖ్యలో క్రీడా కారులు పాల్గొన్నారు.