ఆపద సమయం లో అండగా సీఎం రిలీఫ్ ఫండ్

మహా వెలుగు , భీమారo 01: ఆపద సమయంలో అండగా సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుందని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కలగూర రాజ కుమార్ పేర్కొన్నారు. గురువారం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విప్ బాల్క సుమన్ కృషి తో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో భీమారం సర్పంచ్ గద్దె రాంరెడ్డి, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ పర్తిరెడ్డి మహేశ్వర్ రెడ్డి, చెన్నూర్ మార్కేట్ కమిటీ డైరెక్టర్ భూక్యా రాజ్ కుమార్ నాయక్, కొత్తపల్లి మాజీ సర్పంచ్ ఆకుదారి రాజన్న,నాయకులు, రూప్ సింగ్ నాయక్, వడ్లకొండ పవన్ తదితరులు పాల్గొన్నారు