- మంచానికే పరిమితమైన రేపల్లి సరిత
మహా వెలుగు కురవి/మే11 రిపోర్టర్ చల్ల వేణు :- మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన దుర్గయ్య – రమణ దంపతుల కుమార్తె సరితకు 12 సంవత్సరాల క్రితం మహబూబాబాద్ మండలం జమండ్ల పల్లి గ్రామానికి చెందిన రేపల్లి హుస్సేన్ తో వివాహం జరిగింది.
వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు .భర్త హుస్సేన్ గత కొన్ని రోజులుగా మత్తు పదార్థాలకు బానిస కావడం తో భార్యను పిల్లలను వదలిశాడు. దిక్కుతోచని పరిస్థితి లో చింతపల్లి తన తల్లి ఇంటికి వచ్చి పిల్లలు తో ఉంటుంది.
రోజు పరిస్థితుల పై ఆలోచన చేస్తూ ఆనారోగ్యంకు గురైంది. బాధపడుతూ మంచానికి పరిమితo అయింది.
అనారోగ్యం పాలైన భార్యను తీసుకొని వెళ్లి వారి బాగోగులు చూసుకోవలసిన బాధ్యత తన భర్త పై ఉందని చింతపల్లి గ్రామ వాసులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
