మహా వెలుగు, మందమర్రి : అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని , అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో నిర్వహించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరైన ప్రభుత్వ విప్ ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు . రానున్న రోజుల్లో మందమర్రి పట్టణంలో అంబేద్కర్ కాంస్య విగ్రహంతో పాటు అంబేద్కర్ చౌరస్తాను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్ , ఎంపీపీ, జెడ్పీటీసీ ,పలువురు సర్పంచ్ లు ,నాయకులు తదితరులు పాల్గున్నారు.
