- సిసి రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు శ్రీకారం
మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్/వి. కపిల్ కుమార్, మహబూబాబాద్/ తొర్రూరు,-26: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ లోని 16 వార్డుల్లో సుమారు రూ.50 లక్షల చొప్పున నిధులతో ఏర్పాటు చేయు సీసీ రోడ్లు, మురుగు నీటి కాలువల పనులకు మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్ కె. శశాంక తో కలిసి శంకుస్థాపన చేశారు.


తొర్రూర్ మున్సిపాలిటీలో వాడవాడలా తిరుగుతూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ ప్రభుత్వం అందించే అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలు సద్వినియోగం చేసుకొవాలని, ప్రతి మారుమూల పల్లెలు, పట్టణాలు సబ్బండ జాతుల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మంత్రి అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ….. పాలనా సౌలభ్యం కోసం నూతన జిల్లాలను ఏర్పాటు చేసుకొని, తొర్రూర్ డివిజన్ కేంద్రం మున్సిపాలిటీగా హోదా కల్పించుకొని అన్ని విధాలుగా అభివృద్ధి లో ఆదర్శప్రాయంగా తొర్రూర్ పట్టణాన్ని సుందరీకరణ చేసుకుంటున్నామని, సిసి రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలతో పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని, ప్రతి వార్డులో సుమారు రూ. 50 లక్షలతో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నట్లుగా మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్ పర్సన్ సురేందర్రెడ్డి, ఎంపీపీ చిన్న అంజయ్య, జెడ్ పి టి సి శ్రీనివాస్, వివిధవార్డుల కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ డా,వి. కపిల్ కుమార్, పోనుగోటి సోమేశ్వర్ రావు, ఇతర సంబంధిత శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

