Manchirala: జాతరలో జర్నలిస్ట్‌ల పేరుతో గొలుసులు లాక్కెళ్లే ముగ్గుర్ని పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లాలో పోలీసుల కళ్లుగప్పి ఫేక్ ఐడీ కార్డుతో చైన్ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్న ముగ్గుర్ని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి పట్టుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి లక్ష 32వేల నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లాలో నకిలీ ఐడీ కార్డులతో చైన్‌స్నాచింగ్స్‌కు పాల్పడిన ముగ్గురు దొంగల్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు జాతర బందోబస్తులో ఉండగా మీడియా ప్రతినిధుల పేరుతో నకిలీ ఐడీ కార్డులు సృష్టించుకొని పట్టణంలో బైక్‌లపై తిరుగుతూ మహిళల మెడలో నగలు ఎత్తుకెళ్లారు.
మంచిర్యాల, హాజీపూర్ ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలోంచి బలవంతంగా గొలుసులు లాక్కెళ్లారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల పట్టణ వ్యాప్తంగా సీసీ కెమెరాలు అమర్చారు. ఆ సీసీ ఫుటేజ్‌ని గమనించిన పోలీసులు చైన్ స్నాచర్స్‌ని వేటాడి పట్టుకున్నారు.
పట్టుబడ్డనిందితుల్లో ఒకరు ట్రాలీ డ్రైవర్ కాగా, మరో ఇద్దరు ఐటిఐ విద్యార్థులుగా గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఈ ఫేక్‌గాళ్ల పేరుతో ఇలా దొంగలించిన గొలుసులను విక్రయించేందుకు వెళుతుండగా మంచిర్యాల టౌన్ చౌరస్తాలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు.గొలుసులు లాక్కొని పారిపోయే క్రమంలో ఎవరైనా అడ్డుకుంటే మీడియా పేరుతో ఐడీ కార్డు చూపించి తప్పించుకునే వాళ్లని పోలీసుల విచారణలోనే . ఇదే విధంగా మంచిర్యాల దగ్గర్లోని మేదరివాడ, వేంపల్లిలో దొంగతనాలు చేశారు నిందితులు. సందీప్ కుమార్‌ది గద్దెరాగడి కాగా, మల్లెపల్లి శ్రావణ్ మరో నిందితుడు పెద్దపెల్లి జిల్లా గోలివాడకు చెందిన వాడిగా తేల్చారు. మూడో నిందితుడు మల్లారపు నివాస్ ఎన్టీపిసిలోని ఆటోనగర్ వాసిగా గుర్తించారు.