ఆదిలాబాద్ ఎమ్మెల్సీ గా దండే విఠల్ ప్రమాణస్వీకారం

హైదరాబాద్ : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా శాసన మండలి సభ్యులుగా ఇటీవల ఎన్నికైన దండే విఠల్ ప్రమాణ స్వీకరం చేశారు. గతంలో ఎమ్మెల్సీ గా పని చేసిన పురాణం సతీష్ కాలపరిమితి ముగియడంతో ఆయన స్థానంలో నూతన ఎమ్మెల్సీగా ఎన్నికైన దండే విఠల్ సోమవారం శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి , మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. నూతన ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేసిన దండే విఠల్ కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ , బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య , ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ శ్యాo నాయక్ , నడిపల్లి విజిత్ రావు , బొకేల తో శుభాకాంక్షలు తెలిపారు.