ఆదివాసి కుటుంబాలకు పోలీసుల అండ…

  • ఆదివాసీలు ఉన్నత విద్య అభ్యసించి దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలి: ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్

మహా వెలుగు ,మంచిర్యాల : మంచిర్యాల జిల్లా దేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటాపూర్ గ్రామపంచాయతీలోని మారుమూల గ్రామం కొల్లంగూడలో దేవాపూర్ పోలీసువారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీ గిరిజన 300 కుటుంబాలకు దుప్పట్ట్లు పంపిణీ, వారితో సంపక్తి భోజనం పోలీస్ మీకోసం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంచిర్యాల జోన్ ఇంచార్జిటీసిపి అఖిల్ మహాజన్ ఐపిఎస్, హాజరైనారు.

ఈ సందర్భంగా ఇంచార్జ్ డిసీపీ గారు మాట్లాడుతూ…. ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, ప్రజా శ్రేయస్సే పోలీసుల ద్యేయం అన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్నో సౌకర్యాలు మెరుగు పడ్డాయని తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలను చక్కగా చదివించుకుని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సౌకర్యాలను సద్వినియొగం చేసుకోవాలన్నారు.

గిరిజనుల శ్రేయస్సు కోసం పోలీస్ శాఖ ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటుందని తమ పిల్లలు చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటుందని అదేవిధంగా ఆదివాసి గిరిజనుల పిల్లలు కూడా ఉన్నత విద్యనభ్యసించి జీవితంలో డాక్టర్, పోలీస్ వంటి వృత్తులు నిర్వహిస్తుంటే చూడాలని ఉంది అని అన్నారు. గిరిజనులకు ఎల్లవేళలా క్షేత్రస్థాయి పోలీస్ అధికారులు అందుబాటులో ఉండి వారికి ప్రతి విషయంలో తోడ్పాటును అందిస్తూ వారి ఉన్నతికి కృషిచేయాలని సూచించారు. గిరిజనులను విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలు కల్పించి వారి ఉన్నతికి తోడ్పడడానికి పోలీస్ శాఖ ఎల్లవేళల సంసిద్ధంగా ఉంటుంది అని తెలిపారు.

ప్రభుత్వం అందించే వివిధ లబ్ధి కార్యక్రమాలను గిరిజనులకు చేర వేయడానికి పోలీస్ శాఖ ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో సంసిద్ధంగా ఉందని అన్నారు . గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని సంఘ విద్రోహ శక్తులు వీరిని ప్రలోభాలకు గురిచేసి వీరిని చెడు మార్గం వైపు నడిచేలా ప్రోత్సహిస్తారు కావున వారి ప్రలోభాలకు లొంగకుండా మంచిని ఎంచుకుని సమాజ శ్రేయస్సుకు పాటు పడాలని సూచించారు. ఎటువంటి కష్టం వచ్చినా ఎల్లవేళలా పోలీస్ శాఖ వారికి అందుబాటులో ఉంటుందని వారు పోలీసులను సంప్రదించాలని సూచించారు.

ఆదివాసులు అసాంఘిక శక్తులకు దూరముగా ఉండాలని ,గ్రామాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు కనిపించిన, పోలిసులకు తెలియచేయాలని అభివృద్ధివైపు అదివాసులు దృష్టిసారించాలని
మారుమూల గ్రామాలను సందర్శించి ప్రజలకు మరింత చైతన్య పరచాలని తెలిపారు
ముఖ్యంగా ఆదివాసి గిరిజన గ్రామాల్లో పర్యటించాలని, స్థానిక సమస్యలను తెలుసుకోని, వెంటనే పరిష్కరించే మార్గాన్ని అన్వేషించాలని సూచించారు.

ప్రజలకు కేవలం శాంతిభద్రతల సమస్య కాకుండా ఇతర సమస్యలున్నా నిర్భయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ సమస్యలు వివరించి నట్లయితే వాటి పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామన్నారు .

ప్రజల కి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకొని, ప్రజలకు పోలీస్ మీకోసం ఉన్నారు అనే భరోసా కల్పించే ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన ఏసీపీ ఎడ్ల మహేష్ , మందమర్రి సీఐ ప్రమోద్ రావు, మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, దేవాపూర్ ఎస్సై విజేందర్ లను డీసీపీ గారు ప్రత్యేకంగా అభినందించారు.

మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుల ఫోటోలతో ఉన్న పోస్టర్ విడుదల

ఈ కార్యక్రమం లో బెల్లంపల్లి ఏసిపి ఎడ్ల మహేష్, మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ , బెల్లంపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ రాజు బెల్లంపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబురావు, దేవాపూర్ ఎస్సై విజేందర్, మందమర్రి ఎస్సై చంద్రకుమార్, పోలీస్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు,ప్రజలు, కుల పెద్దలు పాల్గొన్నారు.