- పిడిఎస్యు జిల్లా నాయకులు బానోత్ దేవేందర్ డిమాండ్
మహావెలుగు డోర్నకల్/జూన్30 రిపోర్టర్ చల్ల వేణు
అధిక ఫీజులు వసూలు చేసే ప్రవేట్ ,కార్పోరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పిడిఎస్యు జిల్లా నాయకులు బానోత్ దేవేందర్ అన్నారు.
అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పిడియస్యూ ఆధ్వర్యంలో డోర్నకల్ మండల డిపిటి తహసిల్దార్ సుధాకర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా నాయకులు బానోత్ దేవేందర్ మాట్లాడుతూ…
పరిసర ప్రాంతాలల్లో కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పేద మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వారు అన్నారు.
ఫీజుల నియంత్రణ పై కమిటీలు, చట్టాలు ఎన్ని చేసిన వాటితో సంబంధం లేకుండా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఈ విద్యాసంవత్సరం ఇప్పటికే తల్లిదండ్రులపై ఫీజులు భారాన్ని విపరీతంగా మోపాయి అని వీటిపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు దృష్టి సారించి నియంత్రించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంది తప్ప నోరు మెదపడం లేదు. ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు.
పుస్తకాలు, నోట్ బుక్కులు, యూనిఫామ్, టైలు షూ ల పేరుతో ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం పేదల జేబులను గుల్ల చేస్తున్నాయి అని వారు అన్నారు. తక్షణమే ఫీజులను నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వ ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భుక్య సతీష్, బోడ నవీన్, సుమన్, ప్రకాష్, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.