మహా వెలుగు , చెన్నూర్ 15 : అడుగులో అడుగునై మీ భాద లో ఒక్కడినై …. మీ కుటుంబానికి అండగా నిలిచేందుకు నేను ఉన్న అని ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ భారీ వర్షాల వల్ల గోదావరి ఉగ్రరూపంతో ఇబ్బందులకు గురైన చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం సిర్స, రొయ్యల పల్లి, పుల్లగామ , రాంపూర్, పాత దేవులవాడ, కొత్త దేవులవాడ, పారుపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పోయేందుకువీలు లేకున్నా ట్రాక్టర్ , నడిచి వెళ్తూ అక్కడ ఉన్న ప్రజల బాధలను విన్నారు.

గోదారమ్మ తల్లి ఒడిలో సేదతీరుతున్న గ్రామాలు. ఆ తల్లి దయతో సల్లంగ బ్రతుకీడుస్తున్న ప్రజలు. కడుపులో పెట్టుకొని చూసుకునే ఆ తల్లి ప్రకృతి వైపరీత్యంతో కన్నెర్ర జేసింది. ఉగ్రరూపం దాల్చింది. శాంతించు మాతల్లి.. కరుణ చూపు గంగమ్మ తల్లి అంటూ శాంతి పూజలు ప్రజలు చేయగా ప్రభుత్వ విప్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విప్ సుమన్ మాట్లాడుతూ… మీ కష్టాల్లో నేను ఉంటానని ఆదర్యం పడొద్దని సూచించారు. వారి వెంట వైస్ ఎంపీపీ వాలా శ్రీనివాస్ రావు , ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్ లు ,ఎంపిటిసిలు పాల్గొన్నారు.

