
హైదరాబాద్, సెప్టెంబర్ 07, మహా వెలుగు: అంబులెన్సులకు కొత్త రూల్ వచ్చింది. హైదరాబాద్ మహానగరంలో నిత్యం ఏదో చోట అంబులెన్స్ సైరన్ వినిపిస్తూనే ఉంటుంది. అవసరం ఉన్న లేకున్నా అంబులెన్స్ డ్రైవర్లు రూల్స్ బ్రేక్ చేస్తుండటం తో పోలీస్ లు ఒక్క అడుగు ముందుకు వేశారు. ఇందులో నిజంగా అత్యవసరం ఉన్నావి చాలా తక్కుగానే ఉన్నాయి. నగరంలో నిత్యం తిరుగుతున్న అంబులెన్స్‌లు చాలా వరకు అవసరం లేకపోయిన సైరన్ ను ఉపయోగించి అనవసరమైన ట్రాఫిక్ అంతరానికి కారణమవుతున్నారని గుర్తించారు పోలీసులు.
దీంతో ఇలా అత్యవసర సమయంలో తప్ప ఊరికే సైరన్ ఉపయోగించే అంబులెన్స్‌లపై చర్యలకు రెడీ అవుతున్నారు. నగరంలో 90శాతం అంబులెన్స్‌లు సైరన్‌ను దుర్వినియోగం చేస్తున్నాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గత కొంత కాలంగా తమ పరిశోధన లో గుర్తించారు. లోపల ఎమర్జెన్సీ పేషెంట్లు ఎవరూ లేకపోయినా అంబులెన్స్ డ్రైవర్లు సైరన్‌ను ఉపయోగిస్తున్నట్లుగా తేల్చారు. అనవసరంగా అంబులెన్స్ సైరన్ ఉపయోగించడం వల్ల ట్రాఫిక్ జామ్ లు ఏర్పడుతున్నాయని అంటున్నారు అధికారులు.
హైదరాబాద్‌లోని ప్రధాన జంక్షన్ల వద్ద రోజూ కనీసం 5 వేల అంబులెన్స్‌లు రోడ్లపైకి వస్తున్నట్లుగా గుర్తించారు. సిటీ ట్రాఫిక్ పోలీసులు. సైరన్ల దుర్వినియోగం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. రోగులెవరూ లోపల లేని సమయంలో కూడా అంబులెన్స్‌లో సైరన్ వాడుతున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. మృతదేహాలను మార్చురీలకు తరలించేందుకు అంబులెన్స్‌లు సైరన్లను ఉపయోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు.
ఈ నిబంధ ప్రకారం ఇప్పుడు అత్యవసర రోగులను తీసుకువెళ్లే అంబులెన్స్‌లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. డ్రైవర్లు లేదా ఆసుపత్రి సిబ్బంది కంట్రోల్ రూమ్ నుండి క్లియరెన్స్ పొందిన తరువాతనే ట్రాఫిక్ లోకి రావాలని పోలీసులు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
