ఐకెపి, వివోఏ, మెప్మా, అంగన్వాడీ, ఆశావర్కర్లు అండగా నిలబడతాం: ఎమ్మెల్యే

మహా వెలుగు రామగుండము 29: దేశవ్యాప్తంగా గత రెండు రోజులుగా జరిగిన సార్వత్రిక సమ్మెకు ఆశా వర్కర్లు, అంగన్వాడీ, ఐకేపీ, మెప్మా ఆర్పీలకు మద్దతు పలుకుతూ, వారి సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ మంగళవారం రామగుండం ఎమ్మెల్యే, టీఆరెఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణను తన కార్యాలయంలో కలుసుకొని వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాలలో పని చేయించుకుంటూ ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారని, సరైన వేతనాలు ఇవ్వకుండా పని భారాన్ని మోపుతున్నారని ఐకెపి, వివోఏ, మెప్మా, అంగన్వాడీ, ఆశావర్కర్లు ఆందోళన చెందుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నా, కేంద్ర ప్రభుత్వం పనిభారం మోపుతూ, పనికి తగిన వేతనాలు ఇవ్వడం లేదనే ఆవేదనతో ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా దాదాపు 20కోట్ల మంది సంఘటిత, అసంఘటితరంగ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆరెఎస్ కార్మిక విభాగం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, ఆశ వర్కర్లు, అంగన్వాడీ, మెప్మా, ఐకేపీ, వీఓఏ సిబ్బంది పాల్గొన్నారు.