- యదేచ్చగా నాసిరకం వస్తువుల విక్రయం
- వంట నూనె నుంచి టీ పొడవు వరకు అదే తంతు
- గడువు ముగిసిన వస్తువుల అమ్మకాలు
- ముడుపుల మాయలో సంబంధిత అధికారులు
- రైడ్ చేస్తే బండారం బట్టబయలు
మహా వెలుగు ,మంచిర్యాల ప్రతినిధి 25 : కల్తీ పదార్థాల అమ్మకం తయారీ నిషేధం వస్తువుల రవాణా అడ్డు అదుపు లేకుండా పోతుంది. కంట్రోల్ చేయవలసిన అధికారులే దారి తప్పి మామూలు తీసుకుంటున్నారు దీంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. జిల్లా వ్యాప్తంగా జీరో కల్తీ వ్యాపారానికి అడ్డా మంచిర్యాల జిల్లా ఇక్కడినుండే తదితర పట్టణాలకు అక్రమ దందాను కొనసాగిస్తుంటారు. మంచిర్యాల జిల్లాలో కల్తీ వ్యాపారాలు జోరుగా కొనసాగుతున్నాయి.
విత్తనాలు ఎరువులు విక్రయాల్లోనూ కల్తీ దందా ఇక్కడనుండే సాగుతుంది రేషన్ బియ్యం ఇసుక అక్రమ వ్యాపారాలు సక్రమంగా జరుపుకుంటున్నారు అప్పట్లో పోలీసులు కొంత కఠినంగా వ్యవహరించడం తో స్తబ్దుగా ఉన్న అక్రమార్కులు తిరిగి తమ వ్యాపారం ప్రారంభించారు.
ఆహారపార్థాలన్ని కల్తీమయం
జిల్లాలోని పలువురు వ్యాపారులు అనేక రకమైన వస్తువులు సరుకులను కల్తీ చేస్తున్నారు స్వలాభాల కోసం జనాల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారు నిత్యం వాడే వంటనూనె టీ పౌడర్ తిను బండారాలను కల్తీ చేస్తూ మార్కెట్లో విక్రయిస్తున్నారు చాలా దుకాణాల్లో పశువుల కళేబరాలతో చేసిన వంటనూనెను దిగుమతి చేసుకొని దర్జాగా విక్రయిస్తున్నారు ఒక కాలనీలో కల్తీ వెల్లుల్లి పేస్ట్ తయారుచేసి గ్రామాలు పట్టణాల్లో దుకాణాలకు సరఫరా చేస్తున్నారు అన్ని రకాల కంపెనీల హోలో గ్రాం లను వాడుకొని అన్ని రకాల పదార్థాలతో జీరో దందా నిర్వహిస్తున్నారు మంచిర్యాలలోని వ్యాపారస్తులు పలు గోదాములలో నిలువచేసి జీరో దందాను కొనసాగిస్తున్నారు అంతేకాకుండా దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది కాలం చెల్లిన కూల్డ్రింక్స్ తీసుకువచ్చి తేదీలు మార్చి తక్కువ ధరలను విక్రయిస్తున్నారని ఆరోపణ సైతం ఉన్నాయి ఇలా అన్ని పదార్థాల ను కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యలతో ఆడుకుంటున్న వారిపై చర్యలు తీసుకునే నాదుడే కరువయ్యాడు ఇప్పటికైనా పోలీసులు సంబంధిత శాఖ అధికారులు స్పందించి కల్తీ నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
భీమారం , చెన్నూర్ లో నకిలీ వ్యాపారం జోరు
మంచిర్యాల జిల్లా భీమారం చెన్నూరు పట్టణాల్లో నకిలీ వ్యాపారం జోరం అందుకుంది పండుగ వస్తే చాలని పండుగలను ఆసరా తీసుకొని జీరో దందాను కొనసాగిస్తున్నారు. నిషేధిత వస్తువులు పుట్టినిల్లుగా ఇక్కడ పేరు ఉంది అంతేకాకుండా కిష్టంపేటలోని ఓ దుకాణంలో నిషేధిత వస్తువులు దొరుకుతున్నట్లు సమాచారం ఆయన అధికారులు స్పందించడం లేదని ప్రజలు అసహన వ్యక్తం చేస్తున్నారు…
వ్యాపారస్తుల గల్లలు ఫుల్
కాగా అమాయక ప్రజలను ఆసరాగా చేసుకొని జీరో దందా చేస్తుండగా వ్యాపారుల గల్లలు మాత్రం నిండుతుండగా ప్రజల ఆరోగ్యాలు మాత్రం క్షీణించిపోతున్నాయి అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.