అర్దరాత్రి అరెస్ట్ లు

మహా వెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ చంద్ర కాంత్ 27 : రామగుండం సింగరేణి ఏరియా ఆర్జీ-3 పరిధిలోని లద్నాపూర్ గురువారం రాత్రి నుంచి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓపెన్ కాస్ట్-2 విస్తరణలో భాగంగా సింగరేణి సంస్థ లద్నాపూర్ గ్రామంలో భూసేకరణ చేపట్టింది. వ్యవసాయ భూములకు సింగరేణి సంస్థ డబ్బులు చెల్లించగా 283 ఇళ్ళకి పరిహారం చెల్లించాలి ఉంది. ఇళ్ళకు పరిహారం చెల్లించే విషయంలో సింగరేణి సంస్థకు భూనిర్వాసితులు, అధికారులు, ప్రజాప్రతినిధులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. గ్రామంలో 283 ఇళ్ళకు చెల్లించకుండా సింగరేణి గురువారం రాత్రి భారీ యంత్రాల సహాయంతో 283 ఇళ్ళ సింగరేణి అధికారులు తొలగించారు. తొలగింపును అడ్డుకున్న 20 మందిని అరెస్ట్ చేసి ముత్తారం పోలీస్ స్టేషన్ తరలించారు. తమకు పరిహారం ఇవ్వకుండా తమ ఇళ్ల తొలగింపునకు నిరసనగా గ్రామస్తులు ఓసీపీ- 2గేటు ముందు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉదయం పూట విధులకు వెళ్లి కార్మికులను గ్రామస్తులు అడ్డుకుంటున్నారు. దీంతో ఓసీపీ-2 గేటు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.