మహా వెలుగు హైదరాబాద్: ఆరేళ్లలో 1000 మంది యువతులు, మహిళలను మోసగించిన జోగాడ వంశీకృష్ణ (31) ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ, తెలంగాణలోని అమ్మాయిలే లక్ష్యంగా శ్వేత, మాధురి, గాయత్రి తదితర పేర్లతో నకిలీ సామాజిక ఖాతాలు రూపొందించాడు. వాటి ద్వారా ఉన్నత చదువులు, సంపన్నవర్గాలకు చెందిన యువతులను ఆకట్టుకొని స్నేహం చేసేవాడు. ఉద్యోగాలు, సేవా కార్యక్రమాలు వంటి వాటిని ఆశచూపేవాడు. సుమారు 1000 మంది బాధితులున్నట్లు గుర్తించారు. వివిధ మార్గాల్లో పాల్పడిన మోసాలతో సుమారు రూ. 5 కోట్ల వరకూ కొట్టేసినట్లు సమాచారం. నిందితుడి కోసం గాలించిన సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కకుండా పలుమార్లు తప్పించుకున్నా
ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
Also read
