అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) అభిషేక్ అగస్త్య కు ఘనంగా సన్మానం, వీడ్కోలు …

మహా వెలుగు ప్రతినిధి,మహబూబాబాద్, ఏప్రిల్ -08:

జిల్లాలో విజయవంతం గా శిక్షణ ముగించుకొని వెళ్తున్న అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) అభిషేక్ అగస్త్య కు జిల్లా కలెక్టర్ కె. శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, ఆర్ డి ఓ కొమురయ్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది శుక్రవారం ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జమ్మూలో పుట్టి పెరిగి సర్వీస్ లో తెలంగాణకు కేటాయించబడి, మహబూబాబాద్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గా శిక్షణ నిమిత్తం ఈ జిల్లాకు 2021 జూన్ 29 నాడు వచ్చారని, జిల్లా ఏర్పాటు తర్వాత మొదటి సారిగా శిక్షణకు వచ్చిన అభిషేక్ అగస్త్య పేరు గుర్తుండి పోతుందని, జిల్లాకు వచ్చిన నాటి నుండి అన్ని ప్రాంతాలలో పర్యటించి అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అవగాహన పొంది విజయవంతంగా శిక్షణను పూర్తి చేసుకున్నారని తెలిపారు.

అసిస్టెంట్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ, ఈ శిక్షణ కాలంలో జిల్లాలోని అధికారులందరూ తమ పూర్తి సహాయ, సహకారాలను అందించారని, శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని వెళ్తున్న సందర్భంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలనాధికారి వెంకటరమణ, కార్యాలయ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.