అటవీ అధికారుల్లారా ఇదేం పని… ?

ఎల్కేశ్వరం బిట్ లో నరికివేతకు గురైన టేకు చెట్టు

  • భీమారం , ఎల్ కేశ్వరం బీట్ల లో టేకు చెట్ల నరికివేత…
  • అధికారులు ఏం చేస్తున్నట్లు… ?
  • అటవీ అధికారులపైనే పలు అనుమానాలు

మహా వెలుగు , మంచిర్యాల 12 : అటవీ అధికారుల్లారా ఇదేం పని… ? ఈ చెట్లను నరికింది ఎవరు…? ఎక్కడికి తరలించారు… ? పలు ప్రశ్నల వర్షం భీమారం అటవీశాఖ అధికారులపై కురిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే…. మంచిర్యాల జిల్లా భీమారం మండలం వ్యాప్తంగా టేకు చెట్ల వనాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఇక్కడే ఆ చెట్లు కూడా దోపిడి అవుతున్నాయి. స్మగ్లింగ్కు గురవుతున్నాయి. ఆ శాఖ అధికారుల ఆస్తం ఉంటుందని ప్రజలు అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. భీమారం ఎల్ కేశ్వరం బిట్ల లో గుట్టుచప్పుడు కాకుండా టేకు దుంగలను గుర్తు తెలియని దుండగులు కొట్టారు. అక్కడి నుండి వాటిని తరలించారు. గత పది రోజుల వ్యవధిలోనే ఈ చెట్లు నరికివేతకు గురైనట్లు ఆనవాళ్లు లేకపోలేదు.

భీమారo బీట్ లో నరికివేతకు గురైన టేకు చెట్టు

నిత్యం పర్యవేక్షిస్తున్న అధికారులు ఏం చేస్తున్నట్లు… ?

నిత్యం పర్యవేక్షణ చేస్తున్న అధికారులు ఏం చేస్తున్నట్లు.. అక్కడ అధికారులు పర్యవేక్షించడం లేదనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాల చెన్నూరు జాతీయ రహదారి నుండి రెండు నుంచి మూడు కిలోమీటర్ల లోపే ఈ చెట్లు నరికివేతకు గురయ్యాయి. అంటే అధికారులు ఏం చేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు పైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కూడా గతంలో సైతం ఇక్కడ పెద్ద మొత్తంలో టేకు కలప స్మగ్లింగ్ చేసేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక స్మగ్లింగ్ తగ్గింది. కానీ ఇప్పుడు మళ్లీ మొదలైనట్లు స్పష్టంగా కనబడుతుంది.

ఎల్ కేశ్వరం బిట్లో నరికివేతకు గురైన టేకు చెట్టు

భీమారం ఎల్ కేశ్వరం బీట్ లో ఇప్పటికే పదుల సంఖ్యలో చెట్లు నరికివేతకు గురయ్యాయి. ఒక రెండు నెలల వ్యవధిలోనే ఇద్దరు నిందితులను పట్టుకొని వారికి నామమాత్రపు జరిమానాలు విధించారు అధికారులు కానీ అంతకు మించి ఇక్కడ టేకు కర్ర బయటకు తరలిస్తున్నారు.

రైతులపై , వ్యవసాయదారుల పై ఇంట్లోకి కట్టెల తెచ్చే వారిపై ,గొల్ల కురుమలు గొర్లను మేపితే , పశువుల కాపరులు పశువుల తోలితే అడవిలో సంపద పోతుందని వారిపై చర్యలు తీసుకునే అధికారులు ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.