మహా వెలుగు కామారెడ్డి 11 : ఓ వృద్ద భార్య, భర్తలు ఏవరికి భారం కాకూడదు అనుకున్నారు. ఎవరి తో సేవ చేయించుకోవాలనుకోలేదు.. వారి పనులు వారు చేసుకోవడం భారం అవుతుండటంతో కఠిన నిర్ణయం తీసుకున్నారు.
మనిషి మనుగడ సాగించాలంటే తన ఆరోగ్యం కూడా సహకరించాలి.. అప్పుడే మనిషి మనుగడ సాధ్యమవుతుంది.. అయితే ఓ వృద్ద భార్య, భర్తలు ఆరోగ్య సమస్యల తో జీవితాన్ని త్యజించారు ఏవరికి భారం కాకూడదు అనుకున్నారు. ఎవరి తో సేవ చేయించుకోవాలనుకోలేదు వారి పనులు వారు చేసుకోవడం భారం అవుతుండటం తో ఇద్దరు వృద్ద దంపతులు తనువు చాలించారు.. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఆరోగొండ ఒడ్డెవ్వ (60) , లింబయ్య (65) ఇద్దరు వృద్ద దంపతులు.. వీరికి ఇద్దరు కొడుకులు. అయితే పెద్ద కొడుకు చనిపోయాడు. గత ఏడాది నుంచి ఆరుగొండ ఒడ్డెవ్వ కు కంటి చూపు మందగించింది.
ఒడ్డెవ్వ కు భర్త లింబయ్య , కొడుకు లింబాద్రి సేవలు చేసే వారు.. అయితే ఒడ్డెవ్వ భర్త లింబయ్య కు మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. దీంతో లింబయ్య కూడా మంచానికి పరిమిత మయ్యాడు.. ఇద్దరి కి సేవ చేయించుకొవడం ఇష్టం లేక జీవితాన్ని ముగించాలని ఆ వృద్ద దంపతులు అనుకున్నారు. అయితే ఎవరు లేని సమయంలో ఇద్దరి కలిసి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు ఉదయం లేచి చూడగా ఇద్దరు ఉరి వేసుకుని కనిపించడంతో కొడుకు లింబాద్రి కన్నీటి పర్యంతం అయ్యారు.