ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం

మహావెలుగు కురవి/జూన్3 రిపోర్టర్ చల్ల వేణు

మహబూబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ లో ముఖ్య అతిధిగా పాల్గొన్న కురవి మండల జడ్పిటిసి బండి వెంకటరెడ్డి ప్రారంభించారు.సీఎం కెసిఆర్ గారు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య భోజనం పుస్తకాలు స్కూల్ యూనిఫామ్స్ , నేటి విద్య సంవత్సరం నుండి 1-8 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం లో విద్యను అందిచడం జరుగుతుందని.
ప్రభుత్వపాఠశాలలోఅనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని.ప్రైవేట్ పాఠశాల అధిక ఫీజులకు పేద మధ్య తరగతి కుటుంబాలు ఎన్నో ఆర్దికంగా ఇబ్బందులు పడుతున్నరాని గ్రామ ప్రజలు ఇట్టి అవకాశాన్ని ఉపయోగించుకొని మన ఊరి బడిలోనే మన పిల్లలు చదవాలని పిల్లలకు వారి తల్లి తండ్రులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ హరిప్రసాద్,ప్రధానోపాధ్యాయులు రఘువేందర్ ఉపాధ్యాయులు యాదగిరి,బిక్షపతి,లక్ష్మ,నరేందర్,లలిత, రమ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.