బాధిత కుటుంబానికి బాసటగా నిలిచినా తోటి కార్మికులు, యాజమాన్యం

మహా వెలుగు రామగుండం ఏప్రిల్ 15 : రామగుండం ఆర్ జి టు ఓసిపి త్రీ ఆర్విఆర్ఓ కంపెనీలో ఆపరేటర్ పనిచేస్తున్న పాండు రాజుల చంద్రయ్య గుండె పోటుతో మరణించారు. దీంతో పాండు రాజుల చంద్రయ్య కుటుంబానికి ఆర్విఆర్ కంపెనీ లో పని చేస్తున్న తోటి కార్మికులు రూ. 2, 44, 000 , యాజమాన్యం రూ. 56, 000/- కలిపి మొత్తం 3 లక్షల రూపాయలు చెక్కును వారి కుటుంబానికి శుక్రవారం అందజేశారు. ఇట్టి చెక్కు అందించిన కార్మికులకు మరియు యాజమాన్యానికి వారి యొక్క కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.