మంచిర్యాల : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లో వెలిశాల మల్లన్న వద్ద రోడ్డు ప్రమాదం జరుగగా భీమారo మండలంలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చదిన సంఘటన తెలుసుకున్న ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మంచిర్యాల్ లో ని ప్రభుత్వ ఆసుపత్రిలో వారి కుటుంబాలనులను ఓదార్చారు. ఆయన సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. పోస్ట్ మార్టం త్వరితగతిన చేయాలని డాక్టర్లను ఆదేశించారు.
అంతేకాకుండా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భూక్య రాజేష్ నాయక్ రవి లను పరామర్శించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన భూక్య చిరంజీవి ,ధరావత్ రవి నాయక్ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా మృతి చెందిన ధరావత్ రవి నాయక్ టిఆర్ఎస్ పార్టీ బూరుగుపల్లి విలేజ్ ప్రెసిడెంట్గా యాక్టివ్ గా వ్యవహరిస్తున్నారు. బూర్గుపల్లి గ్రామంలో వారి అంత్యక్రియలు కానున్నాయి.
