మహాశివరాత్రి పురస్కరించుకొని పుణ్య స్నానాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా గోదావరిలో మెట్లను నిర్మాణం చేశారు. జైపూర్ మండలం లోని శెట్టిపల్లి గ్రామంలో గోదావరి ఘాట్లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గోదావరికి పుణ్య స్నానాలకు భక్తులు వస్తారని దానికోసం గోదారిలో మెట్లు నిర్మించాలని జైపూర్ మండలం జడ్పిటి సి మేడి సునీత – తిరుపతి ఆ గ్రామ సర్పంచ్ మేడి రవి ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ దృష్టికి తీసుకు పోగా తక్షణమే స్పందించిన సుమన్ అధికార యంత్రాంగాన్ని అక్కడున్న నాయకులను పంపించి మెట్లను నిర్మించారు. మెట్లను భక్తుల సౌకర్యార్థం నిర్మించగా భక్తులతోపాటు జెడ్పిటిసి మేడి సునీత – తిరుపతి స్థానిక సర్పంచ్ మేడి రవి ,స్థానిక ఎంపీటీసీ స్వాతి – సంపత్ విప్ సుమన్ కు ధన్యవాదాలు తెలిపారు.