- ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్
తెలంగాణ రాష్ట్రం : ఏప్రిల్ 13 నుండి 24 వరకు కోటపల్లి మండలంలో జరిగే ప్రాణహిత పుష్కరాలకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోరారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం చెన్నూర్ నియోజకవర్గ సమస్యలు , అభివృద్ధి పనుల నిధుల విషమై అసెంబ్లీ వేదికగా సంబంధించి శాఖ మంత్రి దృష్టి కి తీసుకెళ్ళారు. నూతనంగా ఏర్పాటు చేయవలిసిన ఘాట్లు , ఘాట్ల వద్దకు చేరుకొనే రోడ్లు , లైటింగ్ , స్నానం పు గదుల వసతి వంటి తదితర పనులు నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పలు ఆలయాలు అభివృద్ధి కి నిధులు మంజూరు చేయాలని కోరారు.
ఇందులో భాగంగా జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న స్వామి ఆలయం ,కోటపల్లి మండలంలోని కాలభైరవ స్వామి ఆలయం ,మందమర్రి మండలం లోని ఆదివాసీల ఆరాధ్యదైవం గాంధారి మైసమ్మ ఆలయం , ఆర్ కె 1 ఏ వద్ద ఉన్న సమ్మక్క – సారమ్మ జాతర అభివృద్ధి కి నిధులు మంజూరు చేయాలన్నారు.
నూతన రోడ్ల నిర్మాణానికి అడ్డంకి మారుతున్న అటవీ శాఖ అనుమతుల ప్రక్రియ ను వేగవంతం చేయాలన్నారు. పోడు భూముల సమస్యలు తీర్చాలని దాని కోసం నియోజకవర్గo లో ఎఫ్ఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.