ఏ ప్రభుత్వం చేయని విధంగా కేసీఆర్ ప్రభుత్వం ఆడబిడ్డల కోసం చేస్తోంది

ఏ పేదింటి తండ్రి తన బిడ్డ పెండ్లికి అగచాట్లు పడకూడదన్న , సంకల్పం నుంచి స్వరాష్ట్రంలో
పురుడుపోసుకున్న అపూర్వ పథకం కళ్యాణ లక్ష్మిమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. చెన్నూర్ పట్టణం లోని క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డలకు మేనమామ కట్నంగా కెసిఆర్ గడచిన ఏడేళ్లలో 10 లక్షలమంది పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించడం జరిగిందని ,
ఇంత గొప్ప పథకంపై మహిళలు తమ తమ గ్రామాల్లో చర్చ చేయాలని, పథకం యొక్క ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పిలుపునిచ్చారు. మహిళల స్వయం కృషితో ఆర్థికంగా ఎదగాలనే , గొప్ప లక్ష్యంతో సుమారు 15 కోట్ల రూపాయలతో రానున్న రోజుల్లో చెన్నూరు నియోజకవర్గం లోని 102 గ్రామాల్లో 102 సమ్మక్క- సారలమ్మ మహిళా భవన్ లను నిర్మిస్తున్నట్లు వారు తెలిపారు. ఇందులో తొలి విడతలో భాగంగా 36 గ్రామాలు, మూడు మున్సిపాలిటీలలో మహిళ భవనాలు ఏర్పాటు చేస్తమని కొద్ది రోజులలో టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి వీటి నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. మహిళా భవన్ లు పూర్తయిన తర్వాత ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిచే మహిళలకు శిక్షణ ఇప్పిస్తామని
చెన్నూరు నియోజకవర్గ మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతస్థాయిలో ఉంచేందుకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియపరిచారు. మహిళా అభ్యున్నతిలో రాష్ట్రంలోనే గొప్ప నియోజకవర్గంగా చెన్నూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డల ప్రభుత్వం ఉంటుందని ఒక తెలంగాణ సర్కారు తప్పా వేరే పార్టీలతో కాదని ఆయా రాష్ట్రాల్లో పాలిస్తున్న బిజెపి , కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆడబిడ్డల కోసం ఏం చేస్తున్నాయని ,ఆయన ప్రశ్నించారు. మందమర్రి మండలం టౌన్ ,క్యాతనపల్లి మున్సిపాలిటీ – 163, కోటపల్లి మండలంలో- 118
భీమారం మండలంలో – 36, జైపూర్ మండలంలో – 117,చెన్నూర్ టౌన్ ,మండలంలో – 135,
మొత్తం నియోజకవర్గ పరిధిలోని 569 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు ,ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.