పనులపై అలసత్వం చేస్తే ఉపేక్షించేది లేదు

అర్బన్ భగీరథ పనులను మరింత వేగవంతం చేయాలని పనులపై అలసత్వం చేస్తే ఉపేక్షించేది లేదని అధికారులను ఏజెన్సీ లను ప్రజా ప్రతినిధులను విప్ బాల్క సుమన్ హెచ్చరించారు. మున్సిపల్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల పై మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో శనివారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్ మాట్లాడుతూ… మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, పట్టణంలో అభివృద్ధి పనులతో పాటు మౌలిక వసతులు కల్పనపై మరింత శ్రద్ధ వహిస్తున్నట్లు వారు తెలిపారు. మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ. 146.73 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు ముఖ్యంగా రూ.40 కోట్ల రూపాయలతో పట్టణంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అర్బన్ భగీరథ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను సూచించారు. ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న విద్యుత్ స్తంభాలు కాకుండా అదనంగా 350 కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతే కాకుండా ఇండ్ల మధ్యలో ఉన్న స్తంబాలను తొలగించాలని, రూ. 80 లక్షలతో నిర్మిస్తున్న ట్యాంక్ బండ్ మరియు రూ.60 లక్షల తో నిర్వహిస్తున్న , ఊరు రామకృష్ణాపూర్ ,విలేజ్ టాక్ బండ్ సుందరీకరణ పనుల పై చర్చించారు. తొలి విడతలో భాగంగా నిర్వహిస్తున్న సెంట్రల్ డివైడర్లు ,మరియ సెంటర్ లైటింగ్ పనులను మరింత వేగవంతం చేయాలని ,వారు సూచించారు. రూ 29. 60 కోట్ల తో మందమర్రి పట్టణ నడి ఒడ్డున నిర్మిస్తున్న 520 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం తుది దశకు చేరుకున్న నేపథ్యంలో సమాంతరంగా మౌలిక వసతులు ఏర్పాటు ,పనులను పర్యవేక్షించాలని తెలిపారు. రూ. 12 .50 కోట్లతో రైల్వే బ్రిడ్జి నిర్మాణం పనులపై ఆయన ఆరా తీశారు. రూ.4.50 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మరియు నాన్ వెజ్ , వెజ్ మార్కెట్ పనులు ఎక్కడ వరకు వచ్చాయని ,తెలుసుకుని ఆ పనులను వేగిరం చేయాలని ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన మహిళా భవన్ ,7 కమ్యూనిటీ హాల్ ,4 బతుకమ్మ గ్రౌండ్ లు ,ఐదు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే రోడ్లు, మరియు డ్రైన్స్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మందమర్రి , క్యతన్పల్లి రెండు మున్సిపాలిటీ లలో ,తమ సొంత ఖర్చులతో 400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు నియంత్రణలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని డ్రగ్స్ ,అమ్మేవారు తీసుకునేవారు ఎంతటి వారైనా సరే సహించ బోమని ,అవసరమైతే పీడీ యాక్ట్ అమలు సైతం చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సింగరేణి ఏరియా లో మంచినీటి సరఫరా నిర్మాణాలు ,విద్యుత్ లైట్లు స్తంభాలు ఏర్పాటు తదితర అంశాలపై సింగరేణి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని , అవసరమైతే మున్సిపల్ అధికారులు, సింగరేణి అధికారులు సమన్వయంతో పనిచేసి, సమస్యలను పరిష్కరించాలని వారు అధికారులకు సూచించారు. త్వరలో పట్టణ మొత్తం క్షేత్రస్థాయి పర్యటన చేసి అధికారులతో మరోమారు, సమీక్ష సమావేశం నిర్వహించి , మున్సిపాలిటీ అభివృద్ధికి తోడుపడదామని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆయా శాఖల అధికారులు ,సింగరేణి అధికారులు టిఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.