వి. కపిల్ కుమార్ మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్
మహబూబాబాద్ 21 : ఈరోజు ఉదయం సమయం 11:30 నుండి 12 గంటల మధ్యలో బానోత్ రవి మహబూబాబాద్ 8వ వార్డు కౌన్సిలర్,తండ్రి కిషన్,వయసు 35 సం, వృత్తి 8 వ వార్డ్ కౌన్సిలర్ బాబు నాయక్ తండా అను వ్యక్తి ని గొడ్డలి తో దాడి చేసి హత్య చేయడం జరిగింది ఇట్టి విషయంలో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో Cr.no 136/2022 U/s 302 r/w 34 IPC సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసుకొని అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించడం జరిగింది.ఇట్టి కేసులో నేరస్థులైన

- భూక్యా విజయ్s/o బాల్య,వయసు 34 సం, r/o మంగలి కాలనీ,
- భూక్యా అరుణ్ s/o భిచ్యు వయసు 20 సం, r/o బాబు నాయక్ తండ
అను ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది.ఇట్టి కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామనీ,త్వరలో పూర్తి వివరాలను తెలియజేస్తామని జిల్లాఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపారు.
