భర్తను, పిల్లల్ని చంపుతా అని బెదిరించి అత్యాచారం

  • హనుమకొండలో దారుణం జరిగింది. వివాహితను వేధింపులకు గురిచేస్తున్న ఓ వ్యక్తి.. భర్తను, పిలల్ని చంపేస్తానని బెదిరించి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు.

మహా వెలుగు , హనుమకొండ : భర్తను పిల్లలను చంపుతానని బెదిరించి వివాహిత మహిళపై ఓ యువకుడు వేధింపులకు కి పాల్పడ్డాడు. హనంకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలో ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది.

మండలంలోని ముల్కనూర్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాస్ ఈ వివరాలను విలేకరులకు తెలిపారు. మండలంలోని ఓ గ్రామంలో సదరు బాధిత వివాహిత కిరాణా షాప్ నడుపుతోంది. ఆమె భర్త క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన యువకుడు రెండేళ్లుగా ఆమెతో ప్రత్యక్షంగానూ, ఫోన్లోనూ అసభ్య కరంగా మాట్లాడుతూ ఉండేవాడు.

ఈ విషయమై పలుమార్లు పంచాయితీ పెట్టించింది. ఇక ముందు అలా మాట్లాడని పెద్దమనుషుల సమక్షంలో ఒప్పుకునేవాడు. ఆ తర్వాత అలాగే ప్రవర్తించేవాడు. భర్త ఇంట్లో లేకపోవడాన్ని గుర్తించి ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కరుణాకర్ ఆమె ఇంటికి వెళ్లాడు భర్తను పిల్లలను చంపేస్తానని బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.