బసంత్ నగర్ లో రోడ్డు ప్రమాదం ,మంచిర్యాల యువకుడు మృతి

మహా వెలుగు పెద్దపెల్లి జిల్లా : బసంత నగర్ రోడ్డు టర్నింగ్ రైల్వే బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మంచిర్యాల కాలేజ్ రోడ్డు సమీపంలో నివసిస్తున్న వంశీ మరణించాడు. ఆయన బండి పైనుంచి పడిన వెంటనే తలకు బలమైన గాయం తగలడంతో స్పాట్లోనే మరణించాడు. వంశీ 20 మృతుడు ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నారని సమాచారం. వంశి తండ్రి మరణించగా అతనికి సంబంధించిన బాగోగులు అన్ని  తల్లి చూసుకుంటుంది. కాగా వంశీ మరణవార్త విన్న తల్లి , అతని కుటుంబ సభ్యులు మిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
 అయితే వంశీ బండి మీద ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించకపోవడంమే ఆయన మరణానికి ముఖ్య కారణంగా తెలుస్తోంది. ఒకవేళ హెల్మెట్ ధరించి నట్లయితే చిన్న చిన్న గాయాలతో మృతుడు వంశీ ప్రాణాలతో మిగిలే వాడు. ఇకనైనా యువత ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరుతున్నారు.