అఖిలపక్ష కమిటీ బయ్యారం లో మాట్లాడుతున్న నాయకులు
మహా వెలుగు ప్రతినిధి ,మహబూబాబాద్ 11.
బయ్యారం రోడ్డు సెంటర్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో గత పదమూడు సంవత్సరాల క్రితం సాధించుకున్న విలువైన స్థలాన్ని కాజేయడం కోసం ఆంగోత్ ఏసు,భూక్యా హరిరాం లు చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాల్సింది గా అఖిలపక్ష పార్టీలు ప్రజలను కోరారు.
గ్రామాభివృద్ధి కమిటీ అఖిలపక్షం ఆధ్వర్యంలో బయ్యారం అభివృద్ధి కోసం జరిగిన కృషి ప్రజలందరికీ తెలుసు.ఆ క్రమంలోనే సుదీర్ఘకాలం పోరాడి బయ్యారం సి.ఎం.సి స్థలాన్ని అఖిలపక్షం గ్రామానికి సాధించిపెట్టింది.
గత 13 సంవత్సరాలుగా ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేసి కాపాడుతూ వచ్చింది.కానీ ఇప్పుడు కొంతమంది స్వార్థపరులు గ్రామానికి ద్రోహం చేస్తూ ఆ స్థలాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.అందులో భాగంగానే ఈరోజు ఆ స్థలంలో ఆంగోత్ ఏసు నాయకత్వంలో నిర్మాణ పనులు చేపట్టారు. అట్టి పనులను వెంటనే నిలిపివేయాలని అఖిలపక్షం తరఫున డిమాండ్ చేశారు.
గ్రామాభివృద్ధి స్థలాన్ని రక్షించుకోవడానికి ముందుకు రావాల్సిందిగా ప్రజలను కోరారు.
గ్రామ స్థల రక్షణ కోసం 14న, ఉదయం 9 గంటలకు జరుగు సమావేశంలో రాజకీయ పార్టీలు ప్రజా ప్రతినిధులు అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈ సమావేశంలో అఖిలపక్షం నాయకులు గౌని ఐలయ్య, మండ రాజన్న,కంబాల ముసలయ్య,నందగిరి వెంకటేశ్వర్లు, రామగిరి బిక్షం,నంబూరి మధు తదితరులు పాల్గొన్నారు.
