బయ్యారం మండలం లో దేవాదాయ భూములు మాయం

  • కాకతీయుల కాలం  నాటి దేవాలయ భూములు అన్యాక్రాంతం
  • పట్టించుకోని దేవాదాయ శాఖ  ,ఎండో మెంటు సిబ్బంది.
  • మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి  గుడి భూమి, గుడి మాన్యం భూములపై ..రియల్టర్ల … రాజకీయ  నాయకుల కన్ను .
  • యదేచ్చగా అమ్మకాలు  ఇంటి నిర్మాణాలు.
    – దేవాదాయ భూములు దర్జాగా దరణిలో నమోదు.

మహబూబాబాద్/ బయ్యారం: 02 : కాకతీయుల కాలం నుండి  మండలంలో అనేక దేవాలయాలు  నిర్మించి  కాపాడుతూ…. దేవాలయాలో నిత్యం పూజలు చేస్తూ,    దేవాలయాలు  గ్రామ ప్రజలకు బడులగా విలసిళ్లి  పూజలు  చేసేవారు.

కానీ నేడు ఆ దేవాలయాలు పాలకులు పట్టింపు లేక పోవడంతో   , కొన్ని దేవాలయాలు కాల గర్బంలో శిధిలావస్తకు చేరాయి.  భూములకు  రెక్కలు రావడంతో  బయ్యారం మండలంలో శివాలయంలు  , మహదేవుని గుళ్లు , పాండవులగుడి, బైరవ గుళ్లు, గంగదేవుని  గుడి,  ఆంజనేయ స్వామిగుడి,గుడి మాన్యం భూములు  ఆలయ కమిటీల పేరుతో,మరికొన్ని కమిటీలతో ఆ భూములను దోచుకొని రియల్టర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొనసాగిస్తున్నారనిమండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

వీటిలో బాగంగా  మండలకేంద్రంలోని ఆంజనేయ స్వామి గుడి  బయ్యారం  ప్రధాన రమదారి పక్కనే ఉండటంతో ఆలయ భూమి 824 సర్వేనెంబరులోని 0.18 గుంటల భూమి ఉండగా నేడు ఆలయ భూమి కబ్జాకు గురై ఆస్థలంలో కొంత మంది తమకున్న  రాజకీయ పలుకుబడితో ,మరికొంత మంది బినామీలు జర్నలిస్టులమని బెదిరిస్తూ ఆ భూమినీ గజం రెండు వేలకు అమ్మకాలు కొనసాగించి వాటిలో ఇంటి నిర్మానాలు కొనాసగించారు.  ఆంజనేయ స్వామి అర్చకులకు దేవుడి నిత్యం దూప,దీప,నైవేద్యం నిర్వహించే అర్చకులకు ఆలయ మాన్యం భూమి 1669 సర్వే నెంబరులో 0.15 గుంటల భూమి, 1670 సర్వేనెంబరులో 2.29  ఎకరాల భూమి ఆంజనేయ స్వామి గుడి పేరున రెవిన్యూ రికార్డ్ లో ఉన్నది.రియల్టర్లు,రాజకీయ నాయకుల పలుకు బడితో ఆలయ భూములు, మాన్యం భూములు మాయం అవుతున్నాయి.

మండలంలో వందల సంవత్సరాల క్రితం  కాకతీయుల రాజులు సుమారు రెండు శతాబ్దాలు పాలించారు . వారి పరిపాలనా  సమయంలో అనేక దేవాలయాలు నిర్మాంచారు , గుడి భూములు , మాన్యం భూములను రెవిన్యూ  రికార్డులలో లేకుండా  బినామీల పేరుతో ఆలయ భూములు,గుడి మాన్యం భూములు కబ్జా చేసినట్లు తెలుస్తుంది.
ఆంజనేయ ఆలయ భూమి మాయం , మాన్యం భూమి భద్రం అర్చక కుటుంబం సముద్రాల రాధాబాయి :

ఆంజనేయ స్వామి అలయ భూమిలో అర్చకునికి వసతి ఏర్పాటు చేసి వారు నిత్యాఆరాదన కార్యక్రమాలకు గ్రామ ప్రజలు ఆలయ కమిటి ఏర్పాట్లు చేశారు . సముద్రాల రాధాబాయి    తెలిపిన వివరాల ప్రకారం ఆంజనేయ స్వామికి నిత్యం ఆరాధన కార్యక్రమాలను తన భర్త    శ్రీనివాస చార్యులు  , తదనంతరం తన కుమారుడు సుమనాచార్యులు 100 సంవత్సరాలకు పై బడి గుడిని నమ్ముకొని దూప,దీప,నైవేద్య కార్యక్రమాలు నిర్వహించామని,  నేడు తమ వారసులు లేక పోవడంతో తమ ఆదరువు లేక పోవడంతో  గుడి ప్రాంగంణంలో  బయ్యారం గ్రామ పంచాయితీలో 6.59 ఇంటి నెంబరులో ఇంటిని నిర్మించుకొని దానిని అమ్ముకుందామంటే  కొంత మంది నా యింటి కి అడ్డు తగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ భూమిని కబ్జా చేసినా  , ఆంజనేయ స్వామి మాన్యం భూమి 3.02 ఎకరాలు కాపాడుతూ దానితో  వచ్చిన ఫల సహయంతో  బ్రతుకుతూ  వచ్చామని , మండలంలో కాకాతీయుల కాలంలో అనేక ఆలయాల భూములు,మాన్యం భూములు కబ్జా చేసి కొంత మంది గుట్టు చప్పుడు కాకుండా వ్యవహరించడం వల్ల ఆలయాలలో అర్చకులు కార్యక్రమాలకు ముందుకు రాక గుడులు మూత పడే పరిస్తితి ఏర్పడిందని, మండలంలో  ఆంజనేయ స్వామి మాన్యం భూమి నేటికి భద్రంగా కాపాడుతూ  వచ్చామనీ, ఇప్పటికైనా ఆలయ, మాన్యం భూములు  కాపాడాలని అధికారులను వేడుకుంది .

  దేవుడికి సేవ చేసే ఓపిక లేదని,ఆంజనేయ స్వామి భక్తులు, గ్రామ ప్రజలు తమ కుంటుంబాన్ని ఆదుకోవాలని  వేడుకున్నారు.

ఆంజనేయ స్వామి గుడి భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణాలు,గుడి భూమి సర్వే నెంబరు 824 లో అక్రమంగా  కొంత మంది రియల్టర్లు గుడి భూమిని అమ్ముకొనేందుకు కొంత మంది రాజకీయ నాయకులకు పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించి నట్లు  వార్తలు వెలువడుతున్నాయి .
ఆలయ  భూమిలో  వెంచ్చర్లు వేయడంతో ఆ ప్రదేశంలో  పక్కా ఇంటి నిర్మాణాలు యదేచ్చగా కొనసాగుతున్నాయి .మరి కొన్ని ప్లాట్లుగా మార్చి విక్రయాలకు సిద్దంగా ఉన్నాయి . ఆంజనేయ స్వామి కోనేరు సైతం ప్రభుత్వ  రెసిడెన్షియల్ హస్టల్  కు  గుత్తేదారు దారికి అడ్డుగా ఉన్నదని అభ్యంతరం తెలుపడంతో  2020 సం,,లో ఆనాటి బయ్యారం  ఎమ్మార్వో తరంగిణి  ఆలయ కోనేరు పూడ్చి వేయడం జరిగింది.

మండలంలో కాకతీయుల  ఆలయాల భూములు మాయం
కాకతీయ రాజులు ప్రతాపరుద్రుల కాలంలో దేవాలయాలు నిర్మించారు ,  మండల కేంద్రంలో  878 సర్వే నెంబరులో 1.26  ఎకరాల విస్తీర్ణంలో శివాలయం , కోనేరు నిర్మించారు . దేవుడి దూప దీపారాదన చేసే అర్చకులకు ఆనాడు దేవుని మాన్యం భూమి 8  ఎకరాలు ఉండేది. అవి ఇప్పు డు కనుమరుగయినాయి,  కోట గడ్డ గ్రామ పంచాయితీలో   కాకతీయుల కోట  మట్టి తో రాళ్లతో 12 ఎకరాల విస్తీర్ణంలో శత్రు దుర్బేద్యం గా నిర్మాణం చేసి అక్కడ  శివాలయంను 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో  కోనేరుతో  నిర్మించారు .

ఈ ప్రాంతంలో ఆనాటి రాజులు  బయ్యారం  పెద్ద చెరువు  1200 ఎకరాల విస్తీర్ణంలో గుట్టల మద్య  చెరువును తవ్వించినట్లు  ,  తులారం ప్రాజెక్టు  సుమారుగా 600  ఎకరాల విస్తీర్ణంలో  నిర్మాణం చేసినట్లు  చరిత్ర ఆదారాలు తెలుపుతున్నాయి.  ఆ గుడికి మాన్యం భూములు ఇరువై నుండి ముప్పై ఎకరాల వ్యవసాయ భూమి   ఉన్నట్లు సమాచారం .వినోబానగర్ గ్రామంలో తులారం ప్రాజెక్టు  సమీపంలో శివాలయం కాల గర్బంలో కలిసి పోయింది . గుడి మాన్యం, గుడి ప్రదేశం సుమారుగా 12 ఎకరాలు ఉన్నట్లు సమాచారం .  బయ్యారం  మండల కేంద్రంలో  ని మహదేవుని గుళ్లు రెండు ఉన్నాయి. గుడి విస్తీర్ణం 3 ఎకరాలు , మాన్యం వ్యవసాయ భూమి 9 ఎకరాలు ఉన్నట్లు సమాచారం .  మండలంలో గందంపల్లి  ఇల్లందు  ప్రధాన రహాదారి  పక్కనే  ఆంజనేయ గుడి , 3 ఎకరాలు ,  మండలంలోని వెంకట్రాంపురం గ్రామంలో  బైరవుని  గుడి  20 గుంటలు , మాన్యం భూమి 5 ఎకరాలు అన్యాక్రాంతం అయినట్లు  సమాచారం.

మండలంలో దేవాదాయ భూములు సుమారుగా 100 ఎకరాలు కనపడకుండా బినామి పేరుతో, ధరణిలో అధికారులు రైతుల పేరిట నమోదు అయినట్లు తెలుస్తుంది.


కాకతీయుల నాటి దేవుడి గుళ్లను మహ్మదీయుల  రాజుల, రజాకార్ల  కాలంలో వాటిని ద్వసం చేసినట్లు చరిత్ర కారులు తెలుపుతున్నారు.  శివాలయం గుడుల ముందు  కోనేరులు సైతం పూడ్చి వేసి   ,  వ్యవసాయ భూములుగా , ఇంటి స్థలాలుగా తయారు ఛేసినట్లు  మండల భక్తులు ప్రజలు ఆరోపిస్తున్నారు.  మరి కొన్ని దేవాలయాలలో గుప్త నిధులు కోసం తవ్వి విలువైన గుప్త నిధులు తస్కరించినట్లు తెలుస్తుంది.  దీనిపై దేవాదాయ శాక అధికారులు,ఎండోమెంటు అధికారులు పట్టింపు లేక పోవడంతో విలువైన గుడి భూములు,మాన్యం భూములు పలువురు ఆక్రమించుకున్నట్లు  మండల ప్రజలు,భక్తులు చర్చించుకుంటున్నారు . ఇప్పటికైనా అధికారులు స్పదించి దేవాదాయ భూములను రక్షించి సనాతన ధర్మం కాపాడేందుకు కృషి చేయాలని పలువురు భక్తులు వేడుకుంటున్నారు.దీనిపై  దేవాదాయ ఎండోమెంటు  డివిజన్ అధికారి కవితను  సంప్రదించగా వారు దేవాదాయ శాక ఎండోమెంటు ఏసి సంప్రదించాలని  మావద్ద  గుడి సంబదించిన మాన్యం భూములు గుడి భూముల విరాలు లేవని తెలిపారు .

ఆంజనేయ స్వామి అర్చక కుటుంబ సభ్యురాలు సముద్రాల రాధాబాయి