మహా వెలుగు,మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజక వర్గం బయ్యారం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పై కలెక్టర్ శశాంక అనర్హత వేటు వేశారు.
గత మండల పరిషత్ ఎన్నికలలో బయ్యారం మండల ప్రజా పరిషత్ రిజర్వేషన్ కేటగిరీలో ఎస్ టి మహిళకు ఎన్నికలు జరగగా మౌనిక బిసి గొల్ల చెందిన ఎస్ టి గా ధృవీకరణ పొందింది.
ఈ సందర్భంలో అటవీ ప్రాంత గిరిజనులు ముఖ్యంగా కోయ కు చెందిన పలు సంఘాలు దీనిపై అనేక రకాలైన పోరాటాలు నిర్వహించగా కలెక్టర్ శశాంక మౌనిక కుల దృవీకరణ తప్పుగా ఇచ్చారని ధ్రువీకరించి మండల ప్రజా పరిషత్ బయ్యారం నుండి ఎం పి టి సి నుండి శాశ్వతంగా రద్దు చేశారు.
ఈ సందర్భంగా అటవీ గిరిజనులు హర్షం వ్యక్తం చేసి బయ్యారం జాతీయ రహదారిపై టపాసులు కాల్చి నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక ఇచ్చిన తీర్పుకు మండల ప్రజలు ముఖ్యంగా అటవీ ప్రాంత గిరిజన సంఘాలు గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు.
