మహా వెలుగు ప్రతినిధి ,కపిల్ కుమార్ .వల్లేపల్లి
మహా హబూబాబాద్.17అంబేద్కర్ గారూ బుగ్గిపాలవుతున్న బీసీల బతుకులు చూడండి అంటూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్ధానిక అంబెడ్కర్ సెంటర్లో నేతలంతా కలిసి బీసీ హక్కుల నినాదాలు ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు.
ఈసందర్భంగా శంతన్ రామరాజు మాట్లాడుతూ డెబ్బయ్యేండ్ల స్వతంత్ర భారతంలో దగాపడ్డ బీసీలు పాలకుల కుట్రలను ఇంకెంత మాత్రం భరించే స్థితిలో లేరన్నారు. సగానికిపైగా ఉన్న బీసీలు దేశ, రాష్ట్ర ఆర్ధిక రంగానికి వెన్నముకగా ఉన్నారన్నారు. అయినా కూడా బీసీలను కేవలం ఓటుబ్యాంకు గానే పరిగణిస్తున్న ప్రభుత్వాలకు బుద్దిచెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీసీ జనగణన లేకుండా మోసపూరిత వాగ్ధానాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఓ కలగానే మిగిలిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా బీసీలకు బడ్జెట్లో అయిదు నుండి ఆరువేల కోట్లతో ‘ముష్టి” నిధులు కేటాయిస్తున్నారన్నారు. కేటాయించిన ఆ నిధులను వేరే రంగాలకు మళ్లించి బీసీలను బిచ్చగాళ్లుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల సంఖ్యలో బీసీ రుణాల దరఖాస్తులు బుట్టదాఖలు చేశారన్నారు. బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో సైతం తీవ్ర వివక్ష చూపుతున్నారన్నారు. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన బీసీ యువతకు అప్పులు పుట్టక లోన్లు రాక ఆత్మహత్యలకు పల్బడుతున్న దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ష్ఠానాలు కుదించి బీసీల వెన్ను విరుస్తున్నారన్నారు.
112బీసీ కులాల్లో అత్యధిక కులాలు ఆర్థికంగా సామాజికంగా అత్యంత వెనుకబాటులో ఉన్నాయన్నారు. అసలు ప్రభుత్వం దృష్టిలో బీసీలు ఓసిలేమో అన్న అనుమానం కలుగుతోందన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాస్తూ బీసీలను అనగతొక్కుతున్నారన్నారు. బీసీ గురుకులాలు, కళాశాకాల కల్పన ఎండమావిగానే మిగిలాయన్నారు. బీసీల్లో ఒక డాక్టరు, ఓ కలెక్టర్, ఓ ఎస్పీ లాంటి ఉన్నత కొలువులు సాధించాలంటే ఎంత కష్టపడ్డా విజయం సాధించలేని దుస్థితి నెలకొంది అన్నారు. ఇప్పటికైనా బీసీ ప్రజాప్రతినిధులు మేధావులు బీసీల అభ్యున్నతికి పాటుపడాలన్నారు. రాష్ట్రంలో బీసీ సంఘాలు ఉమ్మడి కార్యాచరణ చేసి బీసీల ఐక్యత కోసం పోరాడాలన్నారు. చెద్దరు కప్పుకొని నిద్రపోతున్న బీసీలు మనల్ని అణచివేస్తున్న ప్రభుత్వాల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీసీల్లోని అట్టడుగు కులాలకు చేయూతనందిస్తూ వారిలో భరోసా కల్పించాల్సిన బాధ్యత అన్ని బీసీ కులాలపై ఉందన్నారు. మనం చేసేబీసీ హక్కుల పోరాటం భవిష్యత్ తరాలకు బంగారు బాట వేయాలని ఆకాంక్షించారు.
ఇంకా ఈకార్యక్రమంలో బీసీ నేతలు అన్నంగి రవి, గుంజె హన్మంతు, ఉపేందర్ రామరాజు, బోనగిరి ఉపేందర్, సాగర్ రామరాజు, పద్మం ప్రవీణ్, జనగం సాయి, చిట్టిమల్ల శ్రీమన్, రాం రాథోడ్, పృధ్వి పటేల్, అందె భాస్కర్, భద్రన్న, శేఖర్, వినయ్, పురుషోత్తం, నగేష్, రవి, రాము, నలమాస విక్రం తదితరులు పాల్గొన్నారు.
