- జనాభా దామాషా ప్రకారం గిరిజన రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించాలి.
- ఏండ్లుగా గిరిజనులను అణగదొక్కే ప్రయత్నం జరుగుతుంది.
మహావెలుగు కురవి /మే 23 రిపోర్టర్ చల్ల వేణు. రాష్ట్రపతిగా గిరిజన బిడ్డకు అవకాశం కల్పించాలని గిరిజన శక్తి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలోతు రవి నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. 75 సంవత్సరాల భారత స్వాతంత్రo నుండి ఇప్పటి వరకు ఒక్క గిరిజన వ్యక్తికి అవకాశం కల్పించలేదని భారతదేశంలోని 2011 జనాభా ప్రకారం 7.5 శాతం ఉన్న ఈ వర్గాలలో గిరిజనులకు రాష్ట్రపతికి ఉండే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పాలకులు సముచిత స్థానం కల్పించటం లేదని వాపోయారు.
బ్రిటిష్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఎంతోమంది గిరిజన పోరాట యోధులు పోరాటం చేశారని చెంచురాంనాయక్, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ మరియు అనేక మంది వీరమరణం పొందారని వారిని గుర్తుచేశారు. భారత దేశంలోని గిరిజనులు తమ మనుగడ కోసం నేటికీ వివిధ అరణ్య ప్రాంతాలలో తమ జీవన విధానం,మార్పు కోసం అనేక పోరాటం చేస్తూనే ఉన్నారన్నారు.
గిరిజనుల యొక్క అభ్యున్నతి నత్తనడకన సాగుతోందని అనేక గిరిజన ప్రాంతాల్లో స్థానిక పరిస్థితిని ఆయా రాష్ట్రాలా పరిపాలకులు సరైన విధానంలో గుర్తిoచలేక, సరైన చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయన్నారు. అనేక ప్రభుత్వాలు గిరిజనుల కోసం పనిచేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నాయి కానీ గిరిజనుల యొక్క వార్షిక ప్రణాళికను గిరిజనుల అభివృద్ధికి సమర్ధంగా అమలు చెయ్యటంలేదని ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేశారు.
ఇకనైనా పాలకులు గిరిజనులకు రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని హితబోధ చేశారు. లేదంటే గిరిజనులు ఐకమత్యంతో ముందుకు సాగి రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చేవరకు పోరాటం చేస్తామన్నారు.