భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  • జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

మహా వెలుగు, మంచిర్యాల 12 : అల్పపీడన ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు మరో రెండు రోజులు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పడం జరిగిందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి ఒక ప్రకటనలో తెలిపారు. సహాయార్థం అధికార యంత్రం పూర్తిస్థాయిలో సేవలు అందించడం జరుగుతుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుందని తెలిపారు.

పాత ఇండ్లు, శిథిలావస్థలో ఉన్న నివాసాలలో ఎవరు ఉండకూడదని, అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రావద్దని, ప్రస్తుత పరిస్థితికి ప్రజలు సహకరించాలని తెలిపారు. ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అత్యవసర పరిస్థితులలో కంట్రోల్ రూమ్ నెంబర్ 08736-250500, 08736-250501, 08736-250502, 08736-250504 లను సంప్రదించాలని, ఈ నంబర్లు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయని తెలిపారు.