భార్యను చంపి.. భర్త ఆత్మహత్య
ఓరుగల్లు లో విషాదం..

మహా వెలుగు,ఆత్మకూరు, ఆగష్టు 02: భార్యను హత్య చేసి..పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో చోటుచేసుకుంది. ఆత్మకూరు మండల క్రేందానికి చెందిన తాళ్ల హరీష్ తన భార్య పుష్పలతను మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో గొడ్డలితో నరికి హత్య చేశాడు.

ఆ తర్వాత హరీష్ ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఆత్మకూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. హత్య‌ , ఆత్మహత్య కు గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నా