భీమారo లో మిట్ట మధ్యాహ్నం దొంగతనం

  • తులంన్నర బంగారం , తులం వెండి , రూ. 80 వేల నగదు ను దొంగిలించిన దొంగలు

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా భీమారo మండల కేంద్రంలో మిట్ట మధ్యాహ్నం దొంగతనం జరుగగా బంగారం తులంన్నర తో పాటు నగదు రూ. 80 వేలు , తులం వెండిని దొంగలు దొంగిలించారు. బాధితురాలు బెల్లంకొండ సుమతి తెలిపిన వివరాలు ఇలా ఇన్నాయి. భీమారo మండల కేంద్రంలో ని సమీప బంధువులు ఇంటికి మిట్టమధ్యాహ్నం వెళ్లి వచ్చానని ,వొచ్చి చూస్తే తలుపు పగలగొట్టి ఉండటం తో పాటు బీరువాను ద్వంసం చేసి లాకర్ తీసి ఉందని దీనితో తమ మనవనికి ఫోన్ చేసి చెప్పగా వచ్చాడని తెలిపింది. చూస్తే బీరువా లో ఉన్న నగదు రూ.80 వేలు , బంగారం ,వెండి దొంగలించినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ లకు సమాచారం అందించగా ఎస్ఐ అశోక్ సంఘటన స్థలం చేరుకొని పరిశీలించారు. కాగా గత 15 రోజుల్లో మండల కేంద్రంలో రెండవ దొంగతనం జరిగినట్లు స్థానికులు తెలుపుతున్నారు. రాత్రి సమయంలో పోలీస్ ల గస్తీ ఎక్కువ కావడం , తో మిట్టమధ్యాహ్నం దొంగలు ఇండ్ల లో చొరబడుతున్నరని ప్రజలు తెలుపుతున్నారు.