భీమారం ఏఈ గా డి.కుమారస్వామి

భీమారం, సెప్టెంబర్ 01: భీమారం మండల ట్రాన్స్కో ఏఈ గా డి. కుమారస్వామి శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించరు. ఇంత కాలంగా ఇక్కడ పని చేసిన ఏఈ శ్రీనివాస్ చెన్నూర్ పట్టణానికి బదిలి పై వెళ్లగా, రెబ్బనా మండల ఏఈ గా విధులు నిర్వహించిన కుమారస్వామి ఇక్కడికి బదిలి పై వచ్చారు. మంచిర్యాల ట్రాన్స్కో ఎస్సి కేశవరావ్, మంచిర్యాల డిఈ రాజన్న, చెన్నూర్ ఏడి రవికుమార్ ఆధ్వర్యంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా వారు పుష్ప గుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు… ఏమైనా సమస్యలు ఉంటే 7901678167 గల ప్రభుత్వ నెంబర్ కు సమాచారం అందించాలని కోరారు. ఇందులో మంచిర్యాల డివిజన్ పరిధిలో గల ఏఈ లు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.